సావిత్రి త‌న సొంత డ‌బ్బుతో క‌ట్టించిన స్కూల్… టీచ‌ర్ల జీతాల కోసం ఆమె ఏం చేసిందో తెలుసా?

మహానటి సినిమా చూసినవారిలో చాలామందికి ఓ సందేహం… నిజంగా సావిత్రి దయాగుణం అంత గొప్పదా..? సంపాదించినదంతా సమాజం కోసం ఇచ్చేసిందా..? ఆమె చేతికి ఎముకే లేదా..? నిజమేనా..? అవును, ఈ తరానికి అవన్నీ తెలియాలని లేదు కదా… ఏదో సినిమా కాబట్టి అలా చూపిస్తారు అని అనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయం గురించి తెలుసుకోవాల్సిందే. సావిత్రి నిజ జీవితంలో ఎలా వ్యవహరించారో ఓ వ్యక్తి తన అనుభవాన్ని ఫేస్ బుక్ లో పెట్టుకున్నారు. అదికాస్తా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సావిత్రి నిజంగా ఎంత గ్రేట్..? ఓసారి ఆ పోస్టు చదవండి…

నాకు తెలిసిన సావిత్రి గారు ( దాత )… నేను రేపల్లె స్టేట్ బ్యాంకు లో 1972 నుండీ 1984 వరకు పని చేసాను … అప్పుడు Correspondent S S G H School వడ్డివారిపాలెం పేర మా బ్యాంకు లో Current Account ఉండేది … S S G H School అంటే శ్రీమతి సావిత్రి గణేశన్ హైస్కూల్ అని అర్ధం… సావిత్రి గారు తన స్వగ్రామములో పేద విద్యార్ధుల సౌకర్యార్ధం స్థాపించిన స్కూల్ అది … కేవలం సావిత్రి గారి ఆర్ధిక సహాయముతోనే స్థాపించబడిన స్కూలు అది … ఆ తర్వాత ప్రభుత్వము వారిచే గుర్తించబడి , కొంత ఆలస్యముగా ప్రభుత్వము వారిచే ఉపాధ్యాయులకు నెలసరి జీతములు విడుదల చేయబడుతూ నడపపడుతున్న స్కూలు అది …

గవర్నమెంటు గ్రాంటు లేకపోతే ఆరు నెలలైనా ఉపాధ్యాయులకు జీతాలు అందేవి కావు… వారి స్కూలు తరపున ఉద్యోగి తమ స్టాఫ్ జీతాలచెక్కు మార్చుకోవడానికి మా బ్యాంకుకు వచ్చే వారు… సావిత్రి గారి మీద ఉన్న అభిమానంతో ఆ ఉద్యోగులను పలకరిస్తుండే వాడిని… సుమారు అయిదు నెలలు మా బ్యాంకు తో పని పడక ఆ స్కూలు వారెవరూ మా బ్యాంకు కు రాలేదు… ఒక రోజు నేను మా బ్యాంకు లో Current Account Counter లో పని చేస్తున్నప్పుడు ఆ స్కూలు ఉద్యోగి సావిత్రి గారి సంతకముతో ఉన్న రూ.104000 /_ రూపాయల మద్రాసు ( ఇప్పుడు చెన్నై ) చెక్కు క్లియరెన్స్ కోసము తమ ఖాతాలో జమ చేయడానికి తీసుకుని వచ్చారు …

1975 ప్రాంతంలో రూ. 104000 /- అంటే ఈ రోజుల్లో షుమారు రూ. 40 లక్షలు పైనే… మామూలుగా ఆ ఖాతాలో గవర్నమెంటు బిల్లు జమ అయ్యాక Correspondent సంతకం చేసిన చెక్కు ద్వారా డబ్బులు Withdraw చేసుకుంటారు… అదీ Regular గా జరిగే Procedure… దానికి భిన్నంగా సావిత్రి గారి సంతకముతో తమ స్కూలు ఖాతాలో జమ చేయడానికి చెక్కు రావడంతో ఆసక్తి ఆపుకోలేని నేను ” ఇదేమిటి సర్.. రొటిన్ కు భిన్నంగా సావిత్రి గారి సంతకముతో చెక్కు తెచ్చారు?” అని అడిగాను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *