సావిత్రి అసలు కథ ఇదేనా…మహానటిలో చూపించింది నిజం కాదా…

మహానటి సావిత్రి కథపై తీసిన మహానటి సినిమాలో ఎటు వైపు చూసిన ప్రశంసల వర్షం కురుస్తుంది. సావిత్రి జీవిత కథను అద్భుతంగా తెరకెక్కించారని అందరూ ఘనంగా చెప్పుకుంటున్నారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ సావిత్రి గురించి తెలిసిన వారు ఆంటే సావిత్రి తరం వారు ఆమె జీవితాన్ని చివరి రోజుల్లో బాగా దగ్గర నుండి చూసిన వారు కొంత మంది విమర్శకులు మాత్రం ఈ సినిమా అంటే కాస్త పడుతున్నారు. ఈ సినిమాను చూడటానికి వారి మనస్సు ఏ మాత్రం అంగీరించటం లేదు. ఎందుకంటే సినిమా మొత్తానికి ప్రధానమైన లోపం జెమిని గణేశన్ అసలు రూపాన్ని చూపించకపోవటమే. సావిత్రి జీవితంలో జెమిని గణేశన్ అసలైన మెయిన్ విలన్. కానీ మహానటి సినిమాలో శివాజీ గణేశన్ ని పెద్దగా నెగిటివ్ యాంగిల్ ని ఏ మాత్రం ప్రస్తావించలేదు.

నిజానికి గుమ్మడి ఆత్మకథ కానీ, సావిత్రి జీవితం మీద వచ్చిన పుస్తకాలు గాని, ఆమె దగ్గరి వాళ్ళు చెప్పిన విషయాలను పరిశీలిస్తే మహానటి సినిమాలో వాస్తవాలు తక్కువుగా ఉన్నట్టు తెలుస్తుంది. జెమిని గణేషన్ ని పెళ్లి చేసుకున్నాకే సావిత్రి జీవితంలో కష్టాలు వచ్చాయి. మహానటి సినిమాలో జెమిని గణేశన్ సావిత్రి పట్ల కేవలం ఈర్ష్య తో నే ఉంటాడని చూపించారు.

కానీ జెమిని అసలు రూపాన్ని మహానటి సినిమాలో అసలు చూపించలేదు. సావిత్రి ఆస్థి పాస్తులు అన్ని హారతి కర్పూరం అయ్యిపోవటానికి కారణం జెమిని గణేష్. సావిత్రి మానసికంగా,శారీరకంగా కృంగిపోవటానికి,మద్యానికి బానిస అవ్వటానికి, చివరకి దిక్కు లేని విధంగా చనిపోవడానికి జెమినీ గణేష్ కారణం.

జెమిని గణేష్ సావిత్రిని పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాక సావిత్రిని పూర్తిగా నిర్లక్ష్యం చేసాడు. కానీ ఈ విషయాలు ఏమి సినిమాలో కనపడవు. ఎందుకంటే సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి కండిషన్స్ పెట్టటమే. షూటింగ్ స్పాట్ లో ఉన్నవారందరికి ఇంటి నుంచి సావిత్రి భోజనం తెప్పించి పెట్టేది.

అలాంటి సావిత్రికి చివరి రోజుల్లో భోజనం కరువైందని గుమ్మడి ఆత్మకథలో రాసారు. సావిత్రిని బంధువులు మోసం చేయటం,చివరి రోజుల్లో ఆర్ధిక ఇబ్బందులు మాత్రమే చూపారు. కూతురు కూడా పట్టించుకోకపోవటం వంటివి చూపలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *