షమి భార్యను రెచ్చగొట్టారా..? అసలు ఏం జరిగింది..?

గత కొన్ని రోజులుగా టీం ఇండియా ఆటగాడు మహ్మద్ షమి పై అతని భార్య చేస్తున్న ఆరోపణలతో ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. ఆమె మహిళ కావడంతో ఆమె చేస్తున్న వ్యాఖ్యలపై అందరు ఆశక్తి చూపించి షమిని దోషిగా భావించారు. అటు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కూడా కూడా షమిపై కాస్త దూకుడుగానే వ్యవహరించి అతని కాంట్రాక్టును రద్దు చేసింది. దీనితో ఇక శమి క్రికెట్ కెరీర్ అయిపోయిందని భావించారు అంతా..

అయితే శమి భార్య హాసిన్ జహాన్ చేసిన ఆరోపణల్లో ప్రధానమైన ఆరోపణ అతడు ఫిక్సింగ్ కి పాల్పడ్డాడు అనేది. ఇందుకోసం అతను పలుమార్లు దుబాయ్ కూడా వెళ్ళాడని అతనికి పాకిస్తాన్ కి చెందిన ఒక యువతీ సహాయం చేస్తుందని ఆరోపించింది. దీనితో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ దీనిపై విచారణ ముమ్మరం చేసి విచారణ జరిపింది. దీనితో ఆమె ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయింది. బోర్డ్ కూడా శమి కాంట్రాక్ట్ ని బి గ్రేడ్ కింద పునరుద్దరిస్తూ ప్రకటించింది. దీనితో శమి క్రికెట్ కెరీర్ కి ఎలాంటి ఇబ్బంది లేదని తేలిపోయింది.

ఇక అతని భార్య విషయానికి వస్తే అతని నుంచి ఆమె విడిపోవడానికే ఈ ఆరోపణలు చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆమెకు అంతకముందే ఒకరితో పెళ్లి కాగా పలు కారణాలతో అతని నుంచి ఆమె విడిపోయింది. ఇక ఆమె ఆరోపణల విషయానికి వస్తే చాలా వరకు అవి నిరాధారమైనవేనని తెలుస్తుంది. షమికి అతని మామ కూడా అండగా నిలిచాడు. ఇటు టీం ఇండియా మాజీ ఆటగాళ్ళు ప్రస్తుత ఆటగాళ్ళు కూడా షమికి మద్దతుగా నిలిచారు. శమి అలాంటి వాడు కాదని అన్నాడు.

ఆమె ఆరోపణలను బట్టి చూస్తే ఆమెను వెనుక ఉండి ఎవరో రెచ్చగొట్టారని స్పష్టంగా చెప్పవచ్చుని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇప్పుడు దాదాపు ఈ వివాదం సద్దుమణిగిపోయింది. శమి క్రికెట్ కెరీర్ కి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఇక అతని వ్యక్తిగత జీవితం మాత్రం ఆమెతో కొనసాగే అవకాశం లేదని తెలుస్తుంది. వ్యక్తిగత జీవిత౦పై ప్రస్తుతం విచారణ జరుగుతుంది. కాగా షమీ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడింది అవాస్తవమని తేలడంతో బీసీసీఐ షమీకి తిరిగి కాంట్రాక్ట్ ఇచ్చేందుకు అంగీకరింది. గతంలో ఉన్న విధంగానే షమీకి ‘బీగ్రేడ్’ కాంట్రాక్ట్‌ను బీసీసీఐ అందించింది. దీని ద్వారా షమీ ఇతర ఆటగాళ్లతో పాటు రూ.3కోట్లు వేతనం అందుకోనున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *