శ్రీ రెడ్డి ఇలా వరుసగా ఇంటర్వ్యూల వెనుక రహస్యం!

టీవీ ఛానెల్స్ రేటింగ్స్ విపరీతంగా లేపుతోంది. యూట్యూబుల్లో లక్షలకొద్దీ వ్యూస్. గడిచిన వారం రోజులుగా టీవీలు, యూట్యూబ్ ఛానెళ్లు జపిస్తున్న ఏకైక పేరు శ్రీరెడ్డి. వల్గర్ అనుకోండి, బోల్డ్ అనుకోండి మరేదైనా అనుకోండి..శ్రీరెడ్డి ఇంటర్వ్యూ మాత్రం జనానికి వినోదాన్నిస్తోంది, సినిమా ఇండస్ట్రీకి చెమటలు పట్టిస్తోంది. అసలెందుకు శ్రీరెడ్డి టీవీలకెక్కింది..? చాలా మందిని ఇప్పుడు వెంటాడుతున్న ప్రశ్న ఇదే.

ఇంటర్వ్యూలివ్వడం వలన ఉన్న సినిమా అవకాశాలు కూడా పోతాయి. ఇక ఎవ్వడూ శ్రీరెడ్డిని టచ్ కూడా చేయడు. మరి ఏ ధైర్యంతో శ్రీరెడ్డి ఇదంతా చేస్తోంది.. ఆమె తీరు అర్ధం కాక చాలామంది జుట్టు పీక్కుంటున్నారు.ఇప్పటికే సినిమా ఇండస్ట్రీని చదివేసిన శ్రీరెడ్డి, తనతో పడుకున్న ప్రముఖుల మొబైల్ ఛాటింగ్స్, వీడియోలు, ఫొటోలు, తనతో కలిసున్నప్పటి వీడియా క్లిప్పింగ్స్ జాగ్రత్త చేసి పెట్టిందట. ఇప్పుడు ఆ వీడియోలనే చూపించి, భారీగా పెనాల్టీ కట్టించే పనిలో ఉంది శ్రీరెడ్డి. ఇందుకోసం, ఒక న్యూస్ ఛానెల్ ను కూడా రెడీ చేసి పెట్టుకుంది. శ్రీరెడ్డితో సంబంధం ఉండి, సీక్రెట్ కెమేరాలకు చిక్కుకుపోయిన ఈ ఏడెనిమిది మంది ప్రముఖులు చెల్లించబోయే పెనాల్టీతో ఆమె లైఫ్ లో సెటిలైపోయే ప్లాన్ వేసుకుంది.

అందుకే ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారం, టాలీవుడ్ లో తెలుగమ్మాయిలకు అవకాశాలు లేవంటూ మొదలెట్టి, పరోక్షంగా ఈ ప్రముఖులందరికీ వార్నింగ్ బెల్స్ పంపించేసింది శ్రీరెడ్డి. ఇప్పుడు వీళ్లంతా తమ పరువు తీయద్దంటూ శ్రీరెడ్డి వెంట పడుతున్నారట. చూడాలి..ఎవరెంత కప్పం కడతారో..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *