శ్రీదేవి మృతిపై షాకింగ్ ట్విస్ట్.. 240 కోట్ల హైడ్రామా

అతిలోక సుందరిగా ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి హఠాన్మరణమే ఒక పెద్ద షాకైతే.. ఆమె బాత్ టబ్‌లో పడి మరిణించిందనే రిపోర్ట్ రావడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. మరీ టబ్‌లో పడి చనిపోయేంత మతిస్థిమితం లేని నటి కాదని, ఖచ్చితంగా ఏదో కుట్ర దాగి వుందని అనుమానాలు ఆమె మరణ వార్త వెల్లడైన మరునిమిషం నుంచి ఉన్న విషయం తెలిసిందే.

ఇదే టైంలో రూ.100 కోట్ల ఇన్సూరెన్స్ ప్రస్తావన కూడా రావడంతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరింది. బహుశా ఇదే కరెక్ట్ సమయం అనుకున్నాడో ఏమో గానీ.. బాలీవుడ్ దర్శకుడు సునీల్ సింగ్ ఓ సంచలన అడుగు ముందుకేశాడు. శ్రీదేవి మృతిపై అనుమానాలున్నాయని, దీనిపై స్వతంత్ర విచారణ చేపట్టాలంటూ సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు వేశాడు.

శ్రీదేవి 5 అడుగుల 7 అంగుళాల ఎత్తు వుందని, అయితే ఆమె పడి మృతిచెందిన బాత్ టబ్ కేవలం 5 అడుగుల పొడవు మాత్రమే వుందని.. కాబట్టి శ్రీదేవి మృతి వెనుక ఏదో కుట్ర దాగి వుందంటూ అనుమానాన్ని తన పిటీషన్‌లో తెలిపాడు. ఇక పిటిషనర్ తరఫు లాయర్, సీనియర్ అడ్వొకేట్ అయిన వికాస్ సింగ్ మరో షాకింగ్ విషయాన్ని కూడా ప్రస్తావించారు. శ్రీదేవి పేరుపై ఒమన్ దేశంలో రూ.240 కోట్ల విలువైన ఇన్స్యూరెన్స్ పాలసీ.. ఆమె UAEలో చనిపోతేనే ఆ మనీ రిలీజ్ అవుతుందని కోర్టులో వాదించాడు. దీనిపై సమగ్ర విచారణ చేసిన కోర్టు.. చివరికి లాయర్ వాదనని తోసిపుచ్చింది. సరైన ఆధారాలు లేకపోవడంతో సునీల్ పిటిషన్‌ని కొట్టేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *