శ్రీరెడ్డి ని నాని అడ్డుకున్నాడా… ఏది నిజం…!

శ్రీరెడ్డి ఇప్పుడు ఈ పేరు అందరికి సుపరిచితం. తెలుగు ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసి జాతీయ మీడియా లో కూడా ఈమె గురించి కథనాలు వచ్చేటట్లు చేసింది. అయితే ఇప్పడూ కూడా అదే విధంగా అందరి మీద వ్యాఖ్యలు చేస్తూ బిజీ గా ఉంది. అయితే కొన్ని రోజుల నుంచి తను నాని మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా బిగ్ బాస్ షో లో శ్రీరెడ్డి ఉంటుందని వార్తలు హల్ చల్ చేసినాయి.

అయితే అస‌లు వాస్త‌వం ఏంట‌న్న‌ది నేడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. అలాగే నానిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను నేచుర‌ల్ స్టార్ ఖండించాడు. బిగ్ బాస్ లో పాల్గొనే కటెస్టెంట్ల‌ను ముంబైకి చెందిన ఒక టీమ్ ఎంపిక చేస్తుంది. ఆ ఎంపిక‌తో హోస్ట్ కు ఎలాంటి సంబంధం ఉండ‌దట‌. బిగ్ బాస్ ప్ర‌తినిథులు గానీ, స్టార్ మా ప్ర‌తినిథులుగానీ బిగ్ బాస్ లో పాల్గొనేందుకు శ్రీరెడ్డిని సంప్ర‌దించ‌లేద‌ని స్టార్ మా తెలిపింది.

అలాగే స్టార్ మా సిబ్బందికి కూడా షోకు ఎంపికైన తుది జాబితా గురించి ముందుగా తెలియ‌దట‌. అలాగే షో విష‌యంలో ఎప్పుడూ బిగ్ బాస్ టీమ్ ఎవ్వ‌రూ శ్రీరెడ్డిని సంప్ర‌దించింది లేద‌ని తేల్చి చెప్పింది. అలాగే నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డం ఆమెకు మాములేన‌ని నాని చెప్పిన‌ట్లు ఆక‌థ‌నంలో ఉంది. వీలైనంత వ‌ర‌కూ ఈ వ్వ‌వ‌హారంలో దూరంగా ఉండ‌ట‌మే మంచిద‌ని నానిపై ఎలాంటి వ్యాఖ్య‌లు చేసినా ఆయ‌న రియాక్ట్ కాలేద‌ని స‌ద‌రు క‌థ‌నం ద్వారా తెలుస్తోంది. దీంతో శ్రీరెడ్డి కేవ‌లం ప‌బ్లిసిటీ కోసంమే ఇలాంటి చిల్ల‌ర ప‌న‌లు చేస్తోంద‌ని క్లియ‌ర్ గా తెలిస్తోందని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *