‘మహానటి’పై శ్రీరెడ్డి దారుణ వ్యాఖ్యలు.. దుమారం!!

మహానటి అనూహ్య రీతిలో బాక్సాపీసు వద్ద హిట్ కొట్టింది. ఒకప్పటి అగ్రహీరోయిన్ సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటిట్ టాక్ తెచ్చుకుంది. సావిత్రి పాత్రలో కనిపించిన కీర్తి సురేష్, జెమినీ గణేషన్ రోల్ లో నటించిన దుల్కర్ సల్మాన్ సహా మోహన్ బాబు, ప్రకాష్ రాజు, క్రిష్, సమంత, విజయ్ దేవరకొండ తదితర పాత్రదారులందరికీ ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని చూసిన ప్రేక్షకులంటున్నారు.

మహానటి చిత్రాన్ని నిర్మాతలు వైజయంతీ మూవీస్ పతాకంపై స్వప్న, ప్రియాంకలు స్వయంగా రిలీజ్ చేశారు. అడ్వాన్స్ పద్ధతిలో ఈ చిత్రానికి రూ.110 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగులో ఈ సినిమా థ్రియేట్రికల్ రైట్స్ పేరు 18కోట్లు వచ్చాయి. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు చరిత్రలోనే రికార్డు వసూళ్లు సాధించే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ పై పోరాటం పేరిట ప్రతి విషయంలోనూ వేలు పెడుతున్న వివాదాస్పద నటి నటి శ్రీరెడ్డి ‘మహానటి’నీ వదల్లేదు.

ఈ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసింది.. ‘మహానటి సావిత్రి బతికున్నప్పుడు ఆర్థికసాయం కోసం ఆర్థించినప్పుడు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆమె చనిపోయాక మాత్రం రూ.కోట్లు కుమ్మరించి ఆమె పేరుపై వ్యాపారం చేసుకుంటున్నారు. మహానటి అంటున్నారు.. నా తల్లి సావిత్రి చివరి వరకు త్యాగాలు, దానాలు చేస్తూనే పోయింది. హ్యాట్సాఫ్ తల్లి. కొత్త తెలుగు మహానటిమణుల ను డ్రగ్స్, అల్కాహాల్ ఆడిక్ట్ లుగా చేసి వాళ్ల టాలెంట్ ను పక్కలకు పరిమితం చేసి.. సెక్స్ చేసి వీళ్లందరినీ మోసం చేసి.. పక్క రాష్ట్రాల నుంచి మహానటులను వెతుక్కోవాల్సిన దౌర్భాగ్యం మన నిర్మాతలకు దర్శకులకు పడుతోంది.. తూ.’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో పెట్టిన ఈ పోస్టులో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *