శ్రీరెడ్డి రియ‌ల్ లీక్స్.. లిస్టులో ప్ర‌ముఖ వెబ్‌సైట్లు..?

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో లైంగిక వేదింపులపై గళమెత్తిన నటి శ్రీరెడ్డి.. కొద్ది రోజులుగా కామ్ అయిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా మ‌ళ్ళీ యాక్టీవ్ అయిన శ్రీరెడ్డి 28 వ్యక్తులతో పాటు.. కొన్ని వెబ్‌సైట్ల పై కూడా ఫిర్యాదు చేసింది. ఇందులో ప్రముఖ నటులు, హాస్య నటులతో పాటు నిర్మాతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఉన్నారు. ఇక కొద్ది రోజుల క్రితం క్యాస్టింగ్ కౌచ్ పై నిరసన వ్యక్తం చేస్తూ ఫిల్మ్ చాంబర్ వద్ద అర్థనగ్నంగా నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఆ ఘటన తర్వాత ఆమె జాతీయస్థాయిలో వార్తల్లోకెక్కింది. అయితే, పవన్ కళ్యాణ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, ఆర్జీవీయే అలా మాట్లాడమన్నారని చెప్పడంతో ఆమె ఉద్యమం పక్కదారి పట్టింది. అయితే, ఆమె అంతటితో ఆగకుండా జీవితా రాజశేఖర్‌పై కూడా పలు ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు ఆమెను తీవ్రంగా తిట్టిపోస్తున్నారని… కొంతమంది అయితే ఆమెను రేప్ చేస్తామని, మరికొందరు హత్య చేస్తామని బెదిరించారని ఆమె చెబుతోంది.

దీంతో తాజాగా ఆమె హుమాయన్ నగర్ పోలీస్ స్టేషన్లో 28 మంది వ్యక్తులపై ఫిర్యాదు చేసింది. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ కేసుపై పోలీసులు స్పందిస్తూ.. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఈ కేసు సైబర్ క్రైమ్ కిందకు వస్తుందని, దీనిపై న్యాయ సలహా తీసుకుని ముందుకెళ్తామని చెప్పారు. శ్రీరెడ్డి పేర్కొన్న వ్యక్తుల పేర్లలో జీవితా రాజశేఖర్, హాస్య నటుడు షకలక శంకర్‌, కరాటే కళ్యాణితో పాటు దర్శకులు విజయ్, అజయ్ కౌండిన్య, అరవింద్ 2 హీరోలుతో పాటు, పలు వెబ్‌సైట్ల పేర్లు ఉన్నాయ‌ని స‌మాచారం. ఏది ఏమైనా వివాదాల శ్రీరెడ్డి మ‌రోసారి టాలీవుడ్‌లో ర‌చ్చ ర‌చ్చ చేసేందుకు కంక‌ణం క‌ట్టుకుంద‌ని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *