షాకింగ్ :శ్రీరెడ్డిని `బిగ్ బాస్-2` నుంచి త‌ప్పించింది ఆ స్టార్ హీరోనే..?

న‌టి శ్రీరెడ్డిని `బిగ్ బాస్-2` నిర్వాహకులు నిర్ధాక్ష‌ణ్యంగా తొల‌గించిన సంగ‌తి తెలిసిందే. ఇండ‌స్ర్టీ పై ఆమె చేసిన వ్యాఖ్య‌లు? బిగ్ బాస్ మిగ‌తా కంటెస్టెంట్లు అసౌక‌ర్యం నేప‌థ్యంలో వ‌చ్చిన ఫిర్యాదు మేర‌కు ఆమెను తొల‌గించిన‌ట్లు క‌థ‌నాలొచ్చాయి. అయితే ఇక్క‌డ ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. బిగ్ బాస్ నిర్వాహ‌కులకు ఒక‌సారి ఎంపిక చేసుకున్న త‌ర్వాత వాళ్ల గ‌తం అన‌వ‌స‌రం. షోకు సంబంధించి నియ‌మ నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే ఎంపిక చేస్తారు.

శ్రీరెడ్డి ఎంపిక అలాగే జ‌రిగింది. వాటిని శ్రీరెడ్డి క్రాస్ చేయ‌లేదు. నిజానికి శ్రీరెడ్డి ఆరేంజ్ లో ఇండ‌స్ర్టీపై విమ‌ర్శ‌లు గుప్పించి పాపుల‌ర్ అయింది కాబ‌ట్టే నిర్వ‌హ‌కులు ఆమెను తీసుకున్నారు. అలాంట‌ప్పుడు శ్రీరెడ్డిని తొల‌గించాల్సిన అవ‌స‌రం ఏముంది? అన్న పాయింట్ రెయిజ్ అవ్వ‌గా..

శ్రీరెడ్డి పై గేమ్

శ్రీరెడ్డి తొల‌గింపుకు అస‌లు కార‌కుడు నాని అని ఉప్పందింది. ఈషోకు ఆయ‌నే హోస్ట్. భారీగా పారితోషికం ఆఫ‌ర్ చేసి మ‌రీ నానిని తీసుకున్నారు. అయితే కాస్టింగ్ కౌచ్ వివాదంలో నాని పేరు లాగింది శ్రీరెడ్డి. తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేసింది. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్ధం కూడా జ‌రిగింది. అయితే నాని హోస్ట్ గా చేయాలంటే శ్రీరెడ్డిని త‌ప్పించాల‌ని నాని నిర్వాహ‌కులు మందుంచాడ‌ట‌. అలా జ‌రిగితేనే హోస్ట్ గా బాధ్య‌త‌లు తీసుకుంటాన‌ని లేదంటే? తానే త‌ప్పుకుంటాన‌ని అన్నాడుట‌. అటు ఇండ‌స్ర్టీ పెద్ద‌ల నుంచి కూడా బిగ్ బాస్ నిర్వాహ‌కులు శ్రీరెడ్డి కి యాంటీగా విషయం వెళ్లింది. ఈ నేప‌థ్యంలో నిర్వ‌హ‌కులు స‌మ‌స్య‌ని నాని పై వేయ‌కుండా కంటెస్టంట్ల‌ పై వేసి త‌ప్పించిన‌ట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *