శ్రీరెడ్డికి ఊహించ‌ని షాక్ ఇచ్చిన `బిగ్ బాస్-2`

కాస్టింగ్ కౌచ్ ఉద్య‌మం పేరుతో వ‌ర్ధ‌మాన‌ న‌టి శ్రీరెడ్డి టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. జాతీయ స్థాయిలో క‌థ‌నాలు రావ‌డంతో శ్రీరెడ్డి.. శ్రీ శ‌క్తిగాను మారింది. ఎట్ దే సేమ్ టైమ్ టాలీవుడ్ ఇండ‌స్ర్టీకి బ‌గ్ధ శ‌త్రువైంది. ప‌వ‌న్ ను దూషించ‌డంతో మొత్తం ప్లాప్ అయింది. ఆ ఇమేజ్ అమ్మ‌డికి బిగ్ బాస్-2 లో అవ‌కాశం తెచ్చిపెట్టింది. దీంతో శ్రీరెడ్డి ఆనందంతో ఉబ్బిత‌బ్బింది. సినిమా అవ‌కాశాలు పెద్ద‌గా రాక‌పోయినా జాతీయ‌ స్థాయి పోటీలో పాల్గొనే అరుదైన అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది. జూన్, జూలై లో నేచుర‌ల్ స్టార్ నాని హోస్ట్ గా సీజ‌న్ -2 ను గ్రాండ్ గా ప్రారంభం కానుంది. నిర్వాహకులు షో ప‌నుల్లో త‌ల‌మున‌క‌లై ఉన్నారు. షూట్ చేయ‌డానికి స‌ర్వం సిద్దం చేస్తున్నారు.

శ్రీరెడ్డి తో అసౌక‌ర్యం!

అయితే ఇప్పుడు `బిగ్ బాస్-2` నిర్వాహ‌కులు శ్రీరెడ్డికి ఊహించ‌ని షాక్ ఇచ్చారు. షో కు శ్రీరెడ్డి అన‌ర్హురాలు అంటూ నిర్ధాక్ష‌ణ్యంగా తొల‌గించారు. ఇండ‌స్ర్టీ స‌మ‌స్య‌ల‌పై త‌న పోరాటం న్యాయ‌మైన‌దే అయిన‌ప్ప‌టికీ టాలీవుడ్ ప‌రువు మ‌ర్యాద‌ల‌ను మంట‌గ‌లిపే ప్ర‌య‌త్నం చేసిందని, దీనికి మించి ప‌వ‌న్ త‌ల్లిని దూషించిన కార‌ణంగా ఆమెను తొల‌గించిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. అలాగే మిగ‌తా కంటెస్టెంట్లు ఆమెతో క‌లిసి షో లో పాల్గొన‌డం అంటే అసౌక‌ర్యంగా ఫీల‌వుతామ‌ని ఫిర్యాదు వెళ్ల‌డంతో నిర్వ‌హకులు ఈనిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం. అలేగే హోస్ట్ గా ఉన్న నాని పై కూడా శ్రీరెడ్డి తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. నాని కామాంధుడ‌ని..ఓ అమ్మాయికి రోజంతా న‌ర‌కం చూపించాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెల‌సిందే. ఇవన్నీ ఆలోచించే నిర్వాహ‌కులు శ్రీరెడ్డ‌ని త‌ప్పించిన‌ట్లు తెలుస్తోంది.

మూలిగే న‌క్క‌పై తాటిపండులా!

ఇప్పుడాస్థానంలో నిర్వాహ‌కులు తేజ‌స్వీ మ‌ధివాడ‌ను ఎంపిక చేసుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. శ్రీరెడ్డి కెరీర్ కు ఇది పెద్ద మైన‌స్. అస‌లే టాలీవుడ్ అంతా ఆమె పై కారాలు, మిరియాలు నూరుతోంది. పోరాటం ఫ‌లితంగా అవ‌కాశం, అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత‌లు తిరిగి తీసేసుకుంటున్నారు. ఎక్క‌డ దొరుకుంతా? తొక్కుదామ‌ని ఇంకొంత మంది చూస్తున్నారు. ఇప్పుడు మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ‌ట్లు ఇదో స‌మ‌స్య‌! మ‌రి శ్రీరెడ్డి దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *