సాయి ధరమ్ తేజ్ మౌనంలో ఆంతర్యం

వరస పరాజయాలతో సతమతమైపోతున్న సాయి ధరమ్ తేజ్ మొన్న జరిగిన తన లేటెస్ట్ మూవీ ‘తేజ్ ఐ లవ్యూ’ ఆడియో ఫంక్షన్ లో వ్యవహరించిన తీరు పై చాలామంది ఆశ్చర్యపోతున్నారు. సామాన్యంగా హీరోలు తమ సినిమాలకు సంబంధించిన ఫంక్షన్స్ లో ఉన్నవీ లేనివీ అనేక విషయాలు చెపుతూ తమ సినిమాల పై అంచనాలు పెంచడానికి ప్రయత్నిస్తారు.

 

అయితే సాయి ధరమ్ తేజ్ తన ‘తేజ్ ఐ లవ్యూ’ ఫంక్షన్ లో దీనికి భిన్నంగా ప్రవర్తించి చాలామందిని ఆశ్చర్య పరిచాడు. ఎప్పుడూ తన సినిమాల గురించి ఆహా ఓహో అని చెప్పుకునే సాయిధరమ్ తేజ్ ఈసారి చాలా సంయమనం పాటించాడు. ‘ఇంటిలిజెంట్’ లాంటి చెత్త సినిమా గురించి కూడా పాజిటివ్ గా మాట్లాడి తన తేజ్ తన ‘తేజ్ ఐ లవ్యూ’ ఎలా ఉండబోతోందనే విషయమై ఒక్కమాట కూడ మాట్లాడలేదు.

 

కేవలం చిరంజీవి గురించి మాట్లాడి ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టుల పేర్లు చెప్పి పొడిపొడిగా తన ఉపన్యాసాన్ని ముగించాడు. ఎప్పుడూ మైక్ పట్టుకొని దర్శకుడు కరుణాకరన్ కూడ ఈసినిమా అద్భుతం అని చెపితే తేజ్ ఈసినిమా గురించి ఒక్క మాట్లాడకపోవడం వెనుక కారణాలు ఏమిటి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి.

 

దీనితో ఈసినిమా పై నమ్మకంలేక సాయి ధరమ్ తేజ్ ఇలా ప్రవర్తించాడా లేదంటే ఇంకో ఫ్లాప్ పడితే ఇక తన కెరియర్ అవుట్ అన్న భయంలో తేజ్ ఉన్నాడా అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. అయితే తెలుస్తున్న సమాచారంమేరకు చిరంజీవి తన మేనల్లుడుని ఆదుకోవాలి అన్న ఉద్దేశ్యంతో ఈసినిమా రషెస్ చూసి తన అభిప్రాయాలు చెప్పడమే కాకుండా కొన్ని మార్పులు చేర్పులు కూడ సూచించినట్లు టాక్. దీనితో చిరంజీవి సలహాలతో అయినా తేజ్ కెరియర్ గాడిలో పడుతుందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *