ఆ ఛానెల్ కే మహానటి రైట్స్.. స్టార్స్ సైతం వణుకు తెప్పించే రేటు…

స్టార్ సినిమాల రేంజ్ ను దాటి బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తున్న సావిత్రి బయోపిక్ మహానటి సినిమా శాటిలైట్ రైట్స్ లో కూడా దమ్ముచూపించింది. అశ్వనిదత్ తెలివితేటలతో శాటిలైట్ ఆఫ్టర్ రిలీజ్ అని ఆపడం వల్లే ఇప్పుడు హిట్ సినిమాకు దద్దరిల్లే రేంజ్ లో శాటిలైట్ డిమాండ్ ఏర్పడింది. పోటీగా మూడు నాలుగు ఛానెల్స్ రావడంతో ఎక్కువ రేటుకి అమ్ముడయ్యింది.

సావిత్రి జీవిత కథతో వచ్చిన మహానటి అద్భుత దృశ్యకావ్యంగా తెరకెక్కించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ ల అద్భుత నటనతో సినిమా ఊహించిన దాని కన్నా పెద్ద హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అదిరిపోయే రేంజ్ లో సేల్ అయ్యాయని తెలుస్తుంది.జెమిని, స్టార్ మా, జీ తెలుగు మూడు ఛానెల్స్ పోటీ పడగా ఫైనల్ గా జీ తెలుగు వారు 11 కోట్లతో మహానటి రైట్స్ ను సొంతం చేసుకున్నారట. దాదాపు స్టార్స్ లేకుండానే ఈ సినిమా ఆ రేంజ్ పలికింది అంటే సినిమా గొప్పతనమే అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రేటు తెలుసుకున్న స్టార్స్ గుండేల్లో వణుకు మొదలైంది.

ఎలాంటి అంచనాలు లేకుండా స్టార్ సినిమాలకు ధీటుగా శాటిలైట్ రైట్స్ అమ్ముడవడం ఆశ్చర్యంగానే ఉంది. అశ్వనిదత్ సమర్పణలో వైజయంతి బ్యానర్లో ఈ సినిమా నిర్మించారు. ప్రియాంకా దత్, స్వప్నా దత్ నిర్మాణంలో వచ్చిన మహానటి సినిమా ఈ రేంజ్ హిట్ అందుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *