టాలీవుడ్ షేకింగ్.. పెళ్లైన‌ టాప్ డైరెక్టర్‌తో.. స్టార్ హీరోయిన్‌ ఎఫైర్..?

టాలీవుడ్‌లో ఈ మ‌ధ్య రోజుకో హాట్ టాపిక్ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ రచ్చ చేస్తున్నాయి. గ‌త ఏడాది సుచిత్ర లీక్స్, డ్ర‌గ్స్ రాకెట్ టాలీవుడ్‌లో ఎన్ని ప్ర‌కంప‌న‌లు సృష్టించాయో అంద‌రికీ తెలిసిందే. ఇక ఈ మ‌ధ్య శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పెద్ద యుద్ధ‌మే స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికీ ఆమె టాలీవుడ్‌లో రోజుకో ప్ర‌ముఖుల్ని టార్గెట్ చేస్తూ సోష‌ల్ మీడియాలో దుమారం రేపుతున్నారు. అయితే ఇప్పుడు అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. టాలీవుడ్‌లో వ‌రుస‌గా హిట్ చిత్రాల‌తో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఓ ద‌ర్శ‌కుడు తన చిత్రాల్ఓ న‌టించిన ఒక సాలిడ్ హీరోయిన్లతో ఎఫైర్ నడిపిస్తారనే టాక్ ఫిల్మ్ న‌గ‌ర్‌లో గుప్పుమంది.

ఇక ఆ డైరెక్టర్ ఇప్ప‌టికే ఇద్ద‌రు ముగ్గురు స్టార్ హీరోయిన్లతో ఎఫైర్ న‌డిపాడ‌ని స‌మాచారం. తీరా ప‌ని పూర్తి అయ్యాక వారిని వదిలించుకోవాల్సివస్తే మాత్రం ఎంతోకొంత డబ్బు ఇచ్చి సెటిల్ చేసుకుంటాడ‌ని టాక్. ఇటీవ‌ల ఓ హీరోయిన్ రివర్స్ అయ్యే సరికి ఆమెకు మూడు కోట్లు రూపాయలు ఇచ్చి సెటిల్ చేసుకున్నాడ‌ని ఫిల్మ్ న‌గ‌ర్‌లో గుస‌గుస‌లాడుకుంటున్నారు. అయినా తీరు మార‌ని స‌ద‌రు డైరెక్ట‌ర్ తాజాగా ఈ డైరెక్టర్ మరో హీరోయిన్‌తో రాచ‌కార్యాలు సాగిస్తున్నాడ‌ట‌. వారిద్ద‌రి బంధం ఎంత దూరం వెళ్లిందంటే.. ఆ హీరోయిన్ కోసం హైదరాబాద్‌లోని మ‌ణికొండ‌లో ఓ అపార్ట్ మెంట్ కూడా కొనిచ్చాడని స‌మాచారం. అంతా బాగానే సాగుతున్న టైమ్‌లో .. వారిద్ద‌రి మ్యాట‌ర్ ఆ డైరెక్టర్ ఫ్యామిలీకు తెలియడంతో ఇంట్లో పెద్ద‌ గొడవలే జ‌రిగాయ‌ట. ఇప్పటికీ ఆ గొడవలు కొనసాగుతున్నాయని సమాచారం. అయినప్పటికీ సదరు డైరెక్టర్ మాత్రం త‌న తీరును మార్చుకోకుండా ఆ హీరోయిన్‌త‌తో ఎఫైర్ మాత్రం కొన‌సాగిస్తున్నాడ‌ని ఓ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియ‌లో ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *