మరలా ఇంకో స్టార్ నటుణ్ని కోల్పోయిన టాలీవుడ్…ఎవరో తెలుసా?

టాలీవుడ్‌ సీనియర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టు వినోద్‌(అసలు పేరు అరిసెట్టి నాగేశ్వర రావు) మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు బ్రెయిన్‌ స్ట్రోక్‌తో హైదరాబాద్‌లో కన్నుమూశారు.

. వినోద్‌ అసలు పేరు ఆరిశెట్టి నాగేశ్వరరావు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. 300 చిత్రాలకు పైగా ఆయన నటించారు. పలు చిత్రాల్లో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కనిపించిన ఆయన పలు సీరియళ్లలోనూ నటించారు. ‘ఇంద్ర’, ‘చంటి’, ‘నరసింహనాయుడు’, ‘లారీ డ్రైవర్‌’, ‘మిర్చి’ తదితర చిత్రాల్లో ఆయన నటనకు మంచి గుర్తుంపు వచ్చింది.

వినోద్‌కు భార్య వీనావతి, పిల్లలు శిరీష, సురేష్‌, తేజస్విలు ఉన్నారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వినోద్ మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రగాఢ సంతాపం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *