త్రివిక్రమ్ ఎందుకు రాలేదు..పవన్ తో విభేదమా..?

అజ్ఞాతవాసి సినిమా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మధ్య విభేదాలకు కారణంగా మారిందా..? అంటే అవుననే అంటున్నాయి టాలివుడ్ వర్గాలు. వివరాల్లోకి వెళితే..సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా పవన్ వరుసగా మూడో ఫ్లాప్ ఇచ్చింది.

భారి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పవన్ అభిమానులను కూడా నిరాశకు గురి చేసింది. దీనితో వారు త్రివిక్రమ్ పై విమర్శలు చేసారు. త్రివిక్రమ్ డబ్బు కోసం చూసారుగాని సినిమాపై దృష్టి సారించలేదని విమర్శించారు. దీనితో త్రివిక్రమ్ మనసు నొచ్చుకున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇక పవన్ తో సినిమా చేసేది లేదని కూడా చెప్పాడట. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి నిర్మిస్తున్న చల్ మోహన్ రంగా సినిమా ఆడియో వేడుకకు త్రివిక్రమ్ హాజరు కాలేదు.

ఈ సినిమాను పవన్ త్రివిక్రమ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాంటిది పవన్ హాజరై త్రివిక్రమ్ ఎందుకు హాజరు కాలేదనేది ఎవరికి అంతుబట్టకుండా ఉంది. అయితే దీనికి ప్రధాన కారణం..పవన్ వస్తున్నాడంటే అభిమానులు భారిగా వస్తారు. వారి ముందు మాట్లాడాల్సి వస్తుందని..అది ఇష్టం లేకే ఆయన హాజరు కాలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.అలాగే పవన్ తో గ్యాప్ కూడా వచ్చిందని అది కూడా ఒక కారణమై ఉండొచ్చని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *