ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్‌ …డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్

సావిత్రి బ‌యోపిక్ ఈమ‌ధ్యే చూశాం. అలాంటి ఎత్తుప‌ల్లాలు, అనూహ్య‌ప‌రిణామాలు, విధి వైప‌రిత్యాలు ఉద‌య్ కిర‌ణ్ జీవితంలోనూ ఉన్నాయి. వ‌రుస విజ‌యాల‌తో దూసుకొచ్చిన ఈ యువ తేజం.. స‌డ‌న్‌గా చ‌తికిల‌ప‌డింది. బ‌తుకు భారం, అవ‌మానాల్నీ మోయ‌లేక ఓరోజు త‌నువు చాలించి టాలీవుడ్‌ని శోక సంద్రంలో ముంచేశాడు.

ఇప్పుడు ఈ క‌థానాయ‌కుడి జీవిత క‌థ‌ని తెర‌పైకి తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ద‌ర్శ‌కుడు తేజ‌.. ఈ బ‌యోపిక్ రూప‌క‌ల్ప‌న‌లో బిజీగాఉన్నార‌ని స‌మాచారం. తేజ – ఉద‌య్‌కిర‌ణ్‌ల మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్ద‌రి కెరీర్ ‘చిత్రం’తోనే మొద‌లైంది. ఆ త‌ర‌వాత ‘ఔన‌న్నా కాద‌న్న’ కూడా వీరిద్ద‌రి కాంబోలోనే వ‌చ్చింది. ఉద‌య్ కిర‌ణ్ జీవితాన్ని అతి ద‌గ్గ‌ర‌గా చూసిన వ్య‌క్తుల్లో తేజ ఒక‌రు.

అందుకే.. అత‌ని క‌థ‌ని తీయాల‌ని తేజ నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ‘ఎన్టీఆర్‌’ బ‌యోపిక్ తీసే అవ‌కాశం వ‌చ్చినా దాన్ని ప‌క్క‌న పెట్టేశాడు తేజ‌. ఆ స‌మ‌యంలోనే ఉద‌య్‌కిర‌ణ్ బ‌యోపిక్ తీయాలన్న ఆలోచ‌న వ‌చ్చింద‌ట‌. అయితే ఈ బ‌యోపిక్ కార్య‌రూపం ఎప్పుడు దాలుస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *