శ్రీరెడ్డి దుమ్ముదులిపిన హీరో విశాల్.. నానికి మద్దతు.. నా పేరు కూడా..!

నేచురల్ స్టార్ నాని, ఇతర తెలుగు హీరోలపై చవకబారు ఆరోపణలు చేస్తున్న శ్రీరెడ్డి వ్యవహారంపై తమిళ నటుడు విశాల్ స్పందించారు. ఇప్పుడు నాని పేరు శ్రీరెడ్డి చెప్పారు. ఇలాగే నోరు మూసుకొని కూర్చొంటే ఇంకా ఎవరిపైనైనా బురద జల్లడానికి వెనుకాడరు అని ఆయన తీవ్రంగా స్పందించారు. శారీరకంగా వాడుకొని మోసం చేశారని ఇటీవల సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి వివాదంపై విశాల్ స్పందించారు. శ్రీరెడ్డి ఆరోపణల నేపథ్యంలో నానికి విశాల్ మద్దతుగా నిలిచారు. నాని గురించి నాకు పూర్తిగా తెలుసు. ఆయన నాకు మంచి స్నేహితుడు. వ్యక్తిగతంగా ఉండే రిలేషన్స్ కారణంగా ఆయనకు సపోర్ట్ చేయడం లేదు.

నానిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా దారుణం. మహిళల పట్ల నాని ఎలా వ్యవహరిస్తారనేది అందరికీ తెలుసు అని విశాల్ అన్నారు. ఎవరిపైనైనా ఆరోపణలు చేసేటప్పుడు ఆధారాలతో బయటకు రావాలి. శ్రీరెడ్డి ఎలాంటి ఆధారాలు లేకుండా విమర్శిస్తున్నారు. గుడ్డిగా ఏదో ఒకరిని టార్గెట్ గా చేసుకొంటున్నారని నాకు అనిపిస్తున్నది. ఇలానే కొనసాగితే ఆమె నా పేరు కూడా వాడుకోదన్న గ్యారెంటీ ఏమిటి అని నాని తీవ్రంగా స్పందించారు. శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలతో తెలుగు సినీ పరిశ్రమ ప్రతిష్ఠ దెబ్బ తింటున్నది అని అన్నారు. ఒకరిపై ఆరోపణలు చేస్తున్నామంటే వాటికి ఆధారాలు ఉండాలి. అవాస్తవాలతో ఎవరిపైనైనా బురద జల్లవచ్చు. ఆమె నోటి నుంచి ఎవరి పేరు బయటకు వస్తుందో తెలియని పరిస్థితి, ఆందోళన వ్యక్తమవుతున్నది. లైంగిక నేరాలకు సంబంధించిన చట్టాలలో కొన్ని అసమానతలు ఉన్నాయి. ప్రస్తుత చట్టాల ప్రకారం ఏ మహిళైనా ఎవరిపైనైనా ఆరోపణలు చేయవచ్చు. వాటి ఆధారంగా చట్టాలు పనిచేసుకొంటూ పోతాయి. పురుషులకు తమను తాము కాపాడుకోవడానికి, తమ అభిప్రాయాన్ని వెల్లడించడానికి కూడా అవకాశాలు లేవు. అది సరికాదు అని విశాల్ అభిప్రాయపడ్డారు.

సినీ, వినోద రంగంలో క్యాస్టింగ్ కౌచ్ (వేషాల కోసం మహిళలను శారీరకంగా వాడుకోవడం) సమస్య ఉంది. ఊరు, పేరు తెలియని వ్యక్తులు ఆఫీస్ తెరిచి నేను నిర్మాతను, నేను దర్శకుడిని అనిచెప్పి వేషాల కోసం వచ్చేవారిని ఆడిషన్స్ చేస్తున్నారు. అలా వచ్చే అమ్మాయిలను వాడుకొంటున్నారు. ఇది తెలుగు, తమిళ పరిశ్రమలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. నిర్మాతలు, దర్శకుల పేర్లు చెప్పుకొని వారి సహాయకులు అమ్మాయిలను వేధించిన సంఘటనలు వెలుగులోకి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఇలాంటి చర్యలను అడ్డుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నాం అని విశాల్ వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు కేవలం సినీ రంగానికి పరిమితం కాలేదని, ఇతర రంగాల్లో కూడా ఉన్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *