పెళ్లికి ముందే క‌న్య‌త్వం కోల్పోతే.. ట్రెండింగ్‌లో మ‌రో వివాదం..!

స‌మాజంలో ఒక‌ప్పుడు అమ్మాయిలకు క‌న్య‌త్వం చాలా ముఖ్యం. అయితే రాను రానూ ఆ ప‌రిస్థితులు మారాయి. అబ్బాయిల‌తో స‌మానంగా అమ్మాయిలు కూడా పెళ్లికి ముందే శృంగారాన్ని టేస్ట్ చేస్తున్నారు. అబ్బాయిలు పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే త‌ప్పులేదు కానీ.. అమ్మాయిలు మాత్రం ఆ ప‌ని చేస్తే నానా యాగి చేస్తారు. ఇదే విష‌యం పై అమ్మాయిల వ‌ర్జినిటీ పై త‌మిళ న‌టి తాజాగా చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం అవుతున్నాయి.

అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే.. కన్యత్వం కోల్పోవడమా.. ఇందులో వింతేముంది.. అదేమన్నా తప్పా ఏంటి.. పెళ్లికి ముందే చాలా మంది అబ్బాయిలు సెక్స్‌లో పాల్గొంటారు వర్జినిటీని కోల్పోతారు.. అలాగే అమ్మాయిలు కూడా వర్జినిటీని కోల్పోతారు. ఇందులో ఆడ, మగ అని తేడా ఏం లేదు. ఎవరి ఇష్టం వాళ్లది.. వర్జినిటీపై సందేహాలు అవసరం లేదంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు తమిళ హీరోయిన్ యషిక ఆనంద్. దీంతో ఒక్క‌సారిగా ఆమెను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక యషిక ఆనంద్ న‌టించిన తాజా చిత్రం ఇరుతు అరైయిల్ మురతు కుత్తు. హారర్, కామెడీ నేపధ్యంలో సాగే ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కథ ప్రకారం దెయ్యంగా మారిన ఒక అమ్మాయిని వర్జిన్ అమ్మాయిలతో రొమాన్స్ చేయాలనుకుంటుంది. ఈ డిఫరెంట్ లైన్ తో అక్కడి ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి కలిగించడంలో చిత్రబృందం సక్సెస్ అయింది. ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన యషిక ఆనంద్ తాజాగా వర్జినిటీ మీద కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *