కౌశల్ ఆర్మీపై షాకింగ్ కామెంట్స్ చేసిన అక్కినేని కోడలు సమంతా

బిగ్ బాస్ సీజన్ 2 షో విన్నర్ గా నిలుస్తాడని భావిస్తున్న కౌశల్ కి సపోర్ట్ గా కౌశల్ ఆర్మీ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఏ అంశాన్ని వదలకుండా కౌశల్ ఆర్మీ అన్నింటినీ నిశితంగా పరిశీలిస్తోంది. అంతేకాదు హోస్ట్ నాని, బిగ్ బాస్ టీమ్ పై కూడా కౌశల్ ఆర్మీ గురిపెట్టింది. అందుకే హౌస్ నుంచి నూతన్ నాయుడు బయటకు రాగానే బిగ్ బాస్ పై నెటిజన్లు నిప్పులు కురిపిస్తున్నారు కూడా. ఇక లాభం లేదని హోస్ట్ నాని కూడా కౌశల్ ఆర్మీకి లేఖ రాసి,ప్రేక్షలకు వివరణ ఇచ్చుకున్నాడు. హౌస్ లో అందరినీ సమానంగానే చూస్తానని, ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువని ఉండదని, ఎవరైతే బెస్ట్ ఫెరఫార్మెన్స్ ఇస్తారో వారే విన్నర్ అవుతారని నాని స్పష్టంచేశారు.

ఓటింగ్ ని బట్టి, ఎలిమినేషన్ ఉంటుంది తప్ప, బయటకు పంపడం అనేది తన చేతిలో లేదని,ఒకవేళ అలా ఎవరైనా భావిస్తే, అది వారి విజ్ఞతకు వదిలేస్తానని నాని ఆ లేఖలో చెబుతూ ట్వీట్ చేసారు. ఇక ఓ సాధారణ యాక్టర్ గా బిగ్ బాస్ లో అడుగుపెట్టిన కౌశల్ తన ప్రవర్తనతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుని, తన పేరిట సోషల్ మీడియాలో ఆర్మీ ఏర్పడేలా చేసుకున్నాడు.

ఇక కౌశల్ ఆర్మీ పవర్ ఎలాంటిదో తెల్సుకుని,సెలబ్రిటీలు ఒక్కొక్కరు దిగివస్తున్నారు. ముఖ్యంగా కౌశల్ ఆర్మీకి నానిపై అనుమానాలు తగ్గలేదనిపిస్తోంది. అందుకే బిగ్ బాస్ షోని బహిష్కరిస్తూ, కేవలం కౌశల్ కి ఓట్లు మాత్రమే వేయించాలని కౌశల్ ఆర్మీ సంచలన నిర్ణయం తీసుకుంది.

దీంతో సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏక్టివ్ గా వుండే టాలీవుడ్ టాప్ స్టార్ అక్కినేని సమంత స్పందిస్తూ,”సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత అంతటి ఫాలోయింగ్ బిగ్ బాస్ కే వుంది. ఈ షో అందరికీ బాగా కనెక్ట్ అయింది. కౌశల్ ఆర్మీ గురించి విన్నాను. కౌశల్ కోసం ఆయన అభిమానులు ఎంతగా ఆరాటపడుతున్నారో చూస్తే ఆశ్చర్యం వేసింది. అలాంటి వ్యక్తి చివరిదాకా హౌస్ లో ఉండాలి’అంటూ కౌశల్ కి మద్దతు పలికేసింది.

ఏదో విధంగా కౌశల్ ని ఇంటినుంచి బయటకు పంపాలని అనుకుంటున్న బిగ్ బాస్ కి ,హోస్ట్ నానికి సమంత వ్యాఖ్యలు షాకిస్తాయనడంలో సందేహం లేదు. ఇక సెలబ్రిటీలు ఇలా మాట్లాడ్డం కౌశల్ ఆర్మీకి రెట్టింపు ఉత్సాహం ఇస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *