కౌశల్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ అనసూయ

నిన్నటి దాక సాధారణ నటుడిగా పరిచయం ఉన్న కౌశల్ బిగ్ బాస్ తో తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటిలో అభిమానులను సంపాదించుకున్నాడు. ఎంతో కఠినంగా ఉండే బిగ్ బాస్ షో లో తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ అభిమానుల మన్ననలను పొందటానికి కౌశల్ ఎంతో శ్రమ పడుతున్నాడు. హౌస్ లో ఇతర పార్టిసిపెంట్స్ ఎంత వ్యతిరేకిస్తున్న అంతకు మించి కాన్ఫిడెన్స్ తో బరిలో ఉన్నాడు కౌశల్. కౌశల్ గేమ్ ఆడేటప్పుడు ఎవరితోనైనా ఒకే వైఖరి అవలంభిస్తాడు. బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభం అయినా రెండు వారాల్లోనే కౌశల్ కి అభిమానులు ఏర్పడ్డారు. బిగ్ బాస్ హౌస్ లో ఇతర పార్టిసిపెంట్స్ ఇబ్బంది పెట్టె కొద్దీ బయట అభిమానులు కూడా పెరుగుతు వచ్చారు.

ఇప్పుడు ఆ అభిమానం కౌశల్ ఆర్మీ పేరిట సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తుంది. కౌశల్ కి వచ్చిన ఈ ఫేమ్ చూసి సెలబ్రెటీలు సైతం ఆశ్చర్యపోతున్నారు. కౌశల్ కి ఇంత ఫాలోయింగా… బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేస్తే ఇంత ఫాలోయింగ్ ఉంటుందా అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టీవీ యాంకర్ అనసూయ కూడా కౌశల్ మానియాపై స్పందించింది.

తాను బిజీ షెడ్యూల్ కారణముగా బిగ్ బాస్ మొత్తం ఎపిసోడ్స్ చూడలేకపోతున్నా అని, కొన్ని ఎపిసోడ్స్ చూసినప్పుడు కౌశల్ ఎంత పాపులారిటీ సంపాదించుకొన్నాడో అర్ధం అయిందని, ప్రస్తుతం సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ ఒక సునామీ వలే తయారయిందని చెప్పుకొచ్చింది. అతని ప్రజాదరణ చూస్తూ ఉంటే ఫైనల్ రౌండ్ వరకు ఎదురు ఉండదని చెప్పింది. సినీ,టివి రంగంలో ఉన్న కొంతమంది బిగ్ బాస్ గురించి చెప్పారని, ముఖ్యంగా కౌశల్ గురించి చెపుతుంటే చాలా ఆశ్చర్యం వేసిందని చెప్పుకొచ్చింది.

ఇలా ఒక పార్టిసిపెంట్ పేరుతొ ఆర్మీ ఏర్పడటం ఇదే మొదలు అని కౌశల్ తన స్ట్రాంగ్ పెర్ఫామెన్స్ తో అసాధ్యాన్ని సుసాధ్యం చేసాడని, ఇలాగే కంటిన్యూ అయితే టైటిల్ తప్పకుండా గెలుస్తాడని చెప్పింది. అంతేకాక కౌశల్ లో ఉండే కూల్ నెస్ ప్లస్ పాయింట్ అని ఎదుటి వ్యక్తి ఎంత కోపంగా మాట్లాడుతున్న నవ్వుతు మాటలు తూలకుండా ఉండటం కౌశల్ కే సాధ్యం అయిందని జబర్దస్త్ భామ అనసూయ చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *