యాంకర్ సుమ సంచలన నిర్ణయం…. షాక్ లో అభిమానులు

యాంకర్ సుమ అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఆమె అంతలా తెలుగులో అభిమానులను సంపాదించుకుంది. ఆమె బుల్లితెరలో యాంకరింగ్ అయినా సినిమా ఆడియో వేడుకలు అయినా తనదైన శైలిలో కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తుంది. ఎంత మంది కొత్త యాంకర్స్ వచ్చిన ఆమె స్థానం చెక్కుచెదరలేదు. అయితే ఇప్పుడు సుమ అభిమానులకు ఒక షాకింగ్ వార్తను చెప్పి నిరాశకు గురి చేస్తుంది. సుమ ఈ టీవీలో స్టార్ మహిళ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. గత 12 సంవత్సరాలుగా 3000 లకు పైగా ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న స్టార్ మహిళ లిమ్కా బుక్ లో కూడా స్థానం సంపాదించింది. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎందరో మహిళలు పార్టిసిపేట్ చేసి మురిసిపోయారు. సెలబ్రెటీలు సైతం ఈ కార్యక్రమానికి వచ్చి అభిమానులను అలరించారు.

సుమ ఇక స్టార్ మహిళ కార్యక్రమాన్ని ఆపేయాలని నిర్ణయం తీసుకోని తన పేస్ బుక్ అకౌంట్ ద్వారా తెలిపింది. త్వరలోనే స్టార్ మహిళ కార్యక్రమం ముగియనున్నదని తెలిపింది. ఇప్పటివరకు ఈ షోని ఆదరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ…ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళకు శతకోటి వందనాలు. మరి కొన్ని కొత్త తరహా కార్యక్రమాలను ప్రేక్షకులకు పరిచయం చేసే ఉద్దేశంతో స్టార్ మహిళ కార్యక్రమంనకు ముగింపు పలకాలని నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే గ్రాండ్ ఎపిసోడ్ ప్రసారం చేసి స్టార్ మహిళకు ముగింపు పలుకుతాం. అంటూ తీవ్ర భావోద్వేగానికి గురి అయింది సుమ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *