కౌశల్ ఆర్మీ ప్లాన్ తో బాబు గోగినేని బిగ్ బాస్ నుండి అవుట్

బిగ్ బాస్ రెండో సీజన్ లో మరో ఇంటరెస్టింగ్ వెకెండ్ వచ్చేసింది. ఈ సారి ఎలిమినేషన్ జోన్ లో గీతా మాధురి,తనీష్,బాబు గోగినేని,దీప్తి నల్లమోతు,గణేష్,శ్యామల వంటి హేమాహేమీలు ఉండటంతో….ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది అందరిలోనూ ఆసక్తిగా మారింది. ఈ ఆరుగురు జాగ్రత్తగా గేమ్ ఆడతారు.అందుకే బిగ్ బాస్ హౌస్ లోను మరియు ప్రేక్షకుల్లోనూ ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది ఉత్కంఠగా మారింది.ముఖ్యంగా దీప్తి,గీత,శ్యామల తమకు అదే చివరి అవకాశం అని భావించి చాలా కూల్ గా ఉండటానికి ప్రయత్నం చేసారు. అయితే ఈ వారం చాలా తక్కువ ఓట్లు వచ్చిన బాబు గోగినేని ఎలిమినేట్ అయ్యారు.

బిగ్ బాస్ షో ప్రారంభం అయినప్పుడు చాలా కామ్ గా ఉన్న బాబు గోగినేని షో సాగుతున్న కొద్దీ అయన ప్రభావం చూపటం ప్రారంభించారు. కౌశల్ ఇంటిలో ఉండటానికి వీలు లేదని ఏకంగా ఒక గ్రూప్ ని మెయింటెయిన్ చేసాడు. అంతేకాక కౌశల్ మీద డైరెక్ట్ ఎటాక్ చేయటం వలన బాబు గోగినేని మీద కౌశల్ ఆర్మీ కి వ్యతిరేకత వచ్చేసింది.

బాబు గోగినేని ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్న కౌశల్ అభిమానులకు ఈ వారం బాబు గోగినేని ఎలిమినేషన్ జోన్ లోకి రావటంతో అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని కౌశల్ ఆర్మీ పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. తనీష్ కెప్టెన్ కావటంతో ఎలిమినేషన్ నుంచి సేఫ్ లోకి వచ్చేసినట్టే. ఇక గీత మాధురి, శ్యామల,దీప్తి నల్లమోతులు కౌశల్ కి ఫెవర్ గా ఉన్నట్టు హింట్ ఇచ్చారు.

దాంతో కౌశల్ ఆర్మీ వారికీ సపోర్ట్ గా ఓటింగ్ చేసారు. ఇక గణేష్ సామాన్యుడు కాబట్టి చాలా మందికి సానుభూతి ఉంటుంది. దాంతో గణేష్ కి ఓట్లు బాగానే పడ్డాయి. బాగా తక్కువ ఓట్లు వచ్చిన బాబు గోగినేని ఈ వారం ఎలిమినేట్ అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *