బిగ్ బాస్ హౌస్ గురించి సంచలన నిజాలు బయట పెట్టిన బాబు గోగినేని

బిగ్ బస్ రెండో సీజన్ లో బాబు గోగినేని దాదాపుగా రెండు నెలల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు. హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు. అయితే దురదృష్టవశాత్తు గత వారం ఎలిమినేట్ అయ్యారు బాబు గోగినేని. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక బాబు గోగినేని మీడియాతో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. బయట ఏమి జరుగుతుందో తెలియకుండా ఆలా ఉండటం గొప్ప అనుభూతి అని చెప్పారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు మీరు బయట ఎలా ఉంటారో అలానే ఉండమని చెప్పారట. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళగానే ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవటానికి కాస్త సమయం తీసుకున్నానని, మొదటి 5 స్థానాలలో ఒకరిగా ఉంటే విజయం వరిస్తుందని భావించారట.

కానీ తాను ఆడిన గేమ్ చాలని అన్పించాక మాత్రమే బయటకు వచ్చానని, వారెవరు నన్ను ఎలిమినేట్ చేయలేదని చెప్పుకొచ్చారు. బాబు గోగినేని ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాక ఫ్రెండ్స్ ఎలిమినేట్ అయ్యానని టీవీలో చూసి ఏడ్చారని చెప్పాడు బాబు గోగినేని. బిగ్ బాస్ షో ద్వారా అభిమానుల ప్రేమను పొందానని, విమర్శకులు ఎక్కడకు వెళ్లిన ఉంటారు.

బిగ్ బాస్ హౌస్ లో అప్పుడప్పుడు వేడి నీళ్లు ఇచ్చేవారని,రైస్ కూడా అప్పుడప్పుడు మాత్రమే పెట్టేవారని, అలాంటి పరిస్థితిలో నా గేమ్ ఇంతకన్నా ఎలా బాగుంటుందని ప్రశ్నించారు. బిగ్ బాస్ హౌస్ లో పార్టీసిపెంట్స్ గురించి మాట్లాడుతూ మొదట నేను తేజస్వికి విన్నర్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయని గుర్తించానని చెప్పారు. అయితే తేజస్వి మధ్యలోనే ఎలిమినేట్ అయినట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *