బాబు గోగినేనికి కౌశల్ అంటే ఎందుకు ఇష్టం లేదో తెలుసా?

బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన మొదటి వారం అందరు బాగానే ఉన్నారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. పెద్దతరహాగా ఉండి ఎన్నో ఛానల్స్ లో ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పే హేతువాది బాబు గోగినేని కూడా తానేమిటో మర్చిపోయి బిగ్ బాస్ హౌస్ లో ప్రవర్తించారు. నేను చెప్పిందే కరెక్ట్ అంటూ వాదించటం మొదలు పెట్టారు. మొదటి నుంచి చాలా స్ట్రాంగ్ గా ఉన్న కౌశల్ పై హౌస్ మేట్స్ చాలా కోపంగా ఉన్నారు. అయితే ఇది ఆటలో భాగంగానే జరిగింది. అయితే బాబు గోగినేని మాత్రం ఎలాగైనా కౌశల్ ని బయటకు పంపాలని కృత నిశ్చయంతో ప్రతి క్షణం ఉంటున్నాడు. బాబు గోగినేని కౌశల్ మీద ఎటాక్ చేయటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు.

మొన్న జరిగిన టెంట్ టాస్క్ లో రోల్ రైడ కారణంగా శ్యామల,దీప్తి నల్లమోతులకు గాయాలు అయ్యాయి. అప్పుడు నడవలేని స్థితిలో ఉన్న దీప్తి నల్లమోతును కౌశల్ ఎత్తుకొని తీసుకువెళ్లి పడుకోబెట్టి కాస్త మసాజ్ చేసి దీప్తికి ఊరట కలిగించాడు కౌశల్. అప్పటి వరకు దీప్తి నామినేషన్ లో లేదు. బాబు గోగినేనికి కౌశల్ దీప్తికి సేవలు చేయటం నచ్చలేదు.

దాంతో తన మాటల చాతుర్యంతో పూజను కన్విన్స్ చేసి దీప్తి ఎలిమినేటి జోన్ లోకి వెళ్లేలా చేసాడు బాబు గోగినేని. బాబు గోగినేనికి కౌశల్ మీద ఎంత పాగా ఉందో అయన ప్రత్యేకంగా చెప్పకపోయినా అయన చేతలే చెప్పుతూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే బాబు గోగినేని చేసింది తప్పని అనలేము. ఎందుకంటే ఎవరో ఒకరు ఎలిమినేటి అవ్వాలి. చివరకు ఐదుగురు మిగలాలి.

ఐదుగురిలో ఒకరు విన్నర్ అవుతారు. గేమ్ లో ఉన్నప్పుడు ఆలా ఆలోచించిన గేమ్ అయ్యిపోయాక అందరు కలిసి ఉంటే బాగుంటుంది కదా అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇప్పుడు శత్రువులుగా ఉన్న కౌశల్,బాబు గోగినేని ముందు ముందు రోజుల్లో మంచి స్నేహితులుగా మారిపోతారేమో… ఏమో చెప్పలేము. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఏమైనా జరగవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *