మోక్షజ్ఞ ఎంట్రీ..బాలయ్యపై ఫ్యాన్స్ ఫైర్..!

ఇండస్ట్రీలో నట వారసులకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. తండ్రికి తగ్గ తనయులుగా వారి నట వారసత్వాన్ని కొనసాగించాలని ఉత్సాహ పడుతుంటారు. టాలీవుడ్ లో ఇప్పటికే చిరు వారసుడిగా రాం చరణ్ స్టార్ అనిపించుకున్నాడు. ఇక నాగార్జున కొడుకులు చైతు, అఖిల్ కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఎటొచ్చి మిగిలింది బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ. వెంకటేష్ కొడుకు మాత్రమే.

వెంకటేష్ తనయుడి ఎంట్రీకి ఇంకా టైం ఉందేమో కాని మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. 2014 నుండి ఇదిగో అదుగో అంటున్నారే తప్ప మోక్షజ్ఞ ఎంట్రీ పై క్లారిటీ ఇవ్వడం లేదు. లెజెండ్ లో ఛాన్స్ వచ్చినా కాదన్నాడు. ఎన్.టి.ఆర్ లో ఉన్నాటడని అంటున్నా అది రూమర్ అంటున్నారు. ప్రస్తుతం మోక్షజ్ఞ యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడని తెలుస్తుంది.

అయితే బాలకృష్ణ మోక్షజ్ఞ విషయంలో ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నాడో తెలియట్లేదు. నందమూరి ఫ్యాన్స్ ఈ విషయంలో బాలకృష్ణ మీద ఫైర్ అవుతున్నారు. సాయి కొర్రపాటి ప్రొడక్షన్ లో మోక్షజ్ఞ సినిమా ఉంటుందని చెప్పగా దర్శకుడు ఎవరు.. ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అన్నది తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *