కౌశల్ పై కామెంట్స్ చేసిన సరే గణేష్ ఎందుకు ఎలిమినేట్ కాలేదో తెలుసా?

బిగ్ బాస్ రెండో సీజన్ ప్రారంభంలో కాస్త నిరాశ పరచిన ఆ తర్వాత రోజురోజుకి ఆసక్తికరంగా మారుతుంది. ఏదైనా జరగొచ్చు అనే ట్యాగ్ లైన్ తో ప్రారంభం అయినా బిగ్ బాస్ లో కౌశల్ ని టార్గెట్ చేయటం తప్ప ఏమి జరగటం లేదు. కౌశల్ ని టార్గెట్ చేసిన వారు కౌశల్ ఆర్మీ దెబ్బకు ఎలిమినేట్ అవ్వటం జరుగుతుంది. ఇప్పుడు పూజ కౌశల్ తో గొడవ పెట్టుకుంది. దాంతో కౌశల్ ఆర్మీ ఆమెను టార్గెట్ చేసారు. ఆ తర్వాత గణేష్ కూడా కౌశల్ ని కామెంట్స్ చేసాడు. బిగ్ బాస్ లో ప్రతి వారం ఎలిమినేషన్ కి గణేష్ వస్తాడు…సేవ్ అయ్యిపోతు ఉంటాడు. అందుకే గణేష్ ని ఎలిమినేషన్ స్టార్ అని పిలుస్తారు.

కామన్ మ్యాన్ అని చెప్పుకొనే గణేష్ ఒక RJ. గణేష్ విజయవాడలో రేడియో జాకీగా పనిచేస్తున్నాడు.బిగ్ బాస్ హౌస్ లో ఒక టాస్క్ సమయంలో ఉద్యోగం కోసం ఎన్నో కంపెనీలు తిరిగానని నెలకు 8000 రూపాయిల జీతం వచ్చినా చాలని అనుకున్నానని చెప్పుకొచ్చాడు. అయితే గణేష్ మీద కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

గణేష్ అతను కామన్ మ్యాన్ కాదని.. పెద్ద పెద్ద వాళ్లతో అతనికి పరిచయాలున్నాయని.. కాస్ల్టీ కార్లు, చాలా పెద్ద పెద్ద హోటల్స్‌లో గణేష్ స్టే చేస్తాడని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు అతని ఫేస్‌బుక్, ట్విటర్‌లో కనిపిస్తుండటంతో అవి బాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

గణేష్‌ని ప్రేక్షకులు చాలా లైట్ తీసుకుంటున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎవరైతే కౌశల్‌తో ఎక్కువ వివాదాలు పెట్టుకుంటున్నారో వారే ఇప్పటి వరకూ బయటకు రావడం జరుగుతోంది. కానీ గణేష్ పెద్దగా వివాదాలు పెట్టుకోడు అలాగని అనుకూలంగానూ ప్రవర్తించడు. సైలెంట్‌గా చేసేదంతా చేసుకుపోతుంటాడు.

ఎక్కువగా ప్రేక్షకుల్లో సానుభూతిని రాబట్టే ప్రయత్నం చేస్తుంటాడు. వేరే వాళ్ళు ఎలిమినేట్ అవ్వడం వల్ల అతను ఇంకా ఎలిమినేట్ అవ్వలేదు. వేరే వాళ్ళు ఇతని కంటే ఎక్కువ తప్పులు చేయటం మరియు కౌశల్ ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. అందుకే కౌశల్ ఆర్మీ వాళ్ళని టార్గెట్ చేసే బిజీలో గణేష్ ని లైట్ తీసుకుంటున్నారు. ఇక ఈ లెక్కన చూసుకుంటే వచ్చే వారం గణేష్ కి ఎలిమినేషన్ తప్పేలా లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *