కౌశల్ ఆర్మీ తీరుపై బిస్ బాస్ నిర్వాహకులు సంచలనం నిర్ణయం

ఎక్కడైనా గేమ్స్ పెడితే అక్కడ రిఫరీ చెప్పిందే వేదం. ఒకవేళ రిఫరీ తప్పుచేస్తే, తర్వాత పరిణామాలు ఒక్కసారి చేయిదాటిపోతాయి. సరిగ్గా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 2 లో పరిస్థితి అలాగే తయారయింది. మొత్తం డిసైడ్ ఫాక్టర్ అంతా ఇప్పుడు కౌశల్ ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోయింది. పరిస్థితి చేయిదాటిపోయింది. ఇప్పడు ఇదే విషయంపై బిగ్ బాస్ టీమ్, యాజమాన్యం కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. ఓ సీరియల్ యాక్టర్ గా, సినిమాల్లో కూడా నటించే కౌశల్ అనే వ్యక్తి బిగ్ బాస్ ని శాసిస్తున్నాడు.

బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చింది మొదలు పక్కాగా గేమ్ ఆడుతూ, హౌస్ లో అందరూ కార్నర్ చేసినా సరే, దాన్ని సానుకూలంగా మలచుకున్నాడు. అతని అభిమానులు సోషల్ మీడియాలో ఏర్పాటుచేసిన కౌశల్ ఆర్మీ కారణంగా లక్షలాది అభిమానులను కౌశల్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు దేశం హద్దులు దాటి విదేశాల్లో సైతం కౌశల్ కి అభిమానులు ఏర్పడ్డారు. అందుకు కోట్లలో ఓట్లు నమోదవుతున్నాయి. స్టార్ హీరోలకు కూడా లేని ఫాలోయింగ్ అతని పరమైంది.

ఇక బిగ్ బాస్ షో లో కీలకమైన గ్రాండ్ ఫినాలే దగ్గర పడింది. మరి కొద్దిరోజుల్లో షో ముగియబోతోంది. ఇప్పటికే హోస్ట్ నాని ఏమి మాట్లాడినా, కౌశల్ పై కామెంట్స్ చేసినా బిగ్ బాస్ షో మీద దాని ప్రభావం పడుతోంది. ఎందుకంటే, నాని మీద సైతం కౌశల్ ఆర్మీ విమర్శలు గుప్పించడం,ఎవరి పట్లా పక్షపాతం లేదని కూడా నాని ట్వీట్ చేసే దాకా పరిస్థితి వెళ్లడం తెల్సిందే.

తాజాగా హైదరాబాద్ మాదాపూర్ లో కౌశల్ అభిమానులు నిర్వహించిన 2కె రన్ అనుకున్న దానికంటే సక్సెస్ అయింది. కౌశల్ అభిమానులు ఇలా రోడ్డెక్కి ప్రదర్శన చేయడంతో ఇది చూసిన జనం కూడా వాళ్ళతో అడుగులు వేశారు.అనూహ్యంగా సాగిన ఈ రన్ చూసిన బిగ్ బాస్ యాజమాన్యం ఖంగుతిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కౌశల్ విజేత అవుతాడని ప్రస్తుతం వస్తున్న ఓటింగ్ చెప్పకనే చెబుతోంది.

ఇలాంటి పరిస్థితిలో కౌశల్ కి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా దాని పర్యవసానం ఎలా ఉంటుందో వేరేచెప్పక్కర్లేదు. ఇదే ఇప్పుడు బిగ్ బాస్ యాజమాన్యాన్ని కలవరపరుస్తోంది. గేమ్ విషయంలో కౌశల్ ని విన్నర్ గా ప్రకటించి తీరాలని, లేకుంటే కౌశల్ ఫాన్స్ నుంచి వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వస్తుందని షో నిర్వాహకులు తర్జన భర్జన పడుతున్నారట. ఎక్కువ ఓట్లు వచ్చినవాళ్లే విజేత అవుతారన్న బిగ్ బాస్ రూల్స్ ఇప్పుడు కౌశల్ ని విజేతగా ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *