బిగ్ బాస్ ఎనాలసిస్ బిగ్ బాస్ రెండో సీజన్ విన్నర్ ఎవరో ముందే ఫిక్స్ అయిందా?

మరో మూడు వారాల్లో ముగియనున్న బిగ్ బాస్ సీజన్ 2 రియాల్టీ షో మరింత ఉత్కంఠ రేపుతోంది. చాలామంది ఆసక్తిగా పరిశీలిస్తూ, చిన్న తేడా కనిపించినా సరే ఏమాత్రం ఆడియన్స్ సహించడం లేదు. చివరకు హోస్ట్ నాని,బిగ్ బాస్ టీమ్, స్టార్ మా యాజమాన్యంపై కూడా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెల్సిందే. ఇలాంటి పరిస్థితిలో బిగ్ బాస్ సీజన్ 2విన్నర్ ని ముందే డిసైడ్ చేసినట్లు కూడా కథనాలు వస్తున్నాయి. ఏదైనా జరగొచ్చన్న ట్యాగ్ తో బిగ్ బాస్ రియాల్టీ షో నడుస్తున్నందున ఈ అనుమానాలు బలపడుతున్నాయి.అయితే ఎక్కడైనా తేడా జరిగితే మాత్రం అది స్టార్ మా రేటింగ్ పై కూడా ప్రభావం పడుతుందని కూడా కొందరు అంటున్నారు.

నిజానికి ఇప్పటికే వస్తున్న విమర్శలను జాగ్రత్తగా గమనిస్తున్న బిగ్ బాస్ టీమ్,స్టార్ మా యాజమాన్యం కూడా మరింత జాగ్రత్తగానే ఉంటుందని, ఎక్కడా తేడా జరగదని కూడా కొందరు బల్లగుద్ది వాదిస్తున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ టాప్ ఫినాలే మీద అందరి దృష్టి వుంది. ఫినాలే టాప్ 5కి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరా అనే ఆసక్తి హౌస్ మెంబర్స్ లోనే కాదు ఆడియన్స్ అందరిలో నెలకొంది.

ఇలాంటి సమయంలోనే బిగ్ బాస్ టైటిల్ ముందుగానే ఫిక్స్ చేశారని,ఫలితాలను కావాలని తారుమారు చేసేస్తారని ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. అయితే ప్రస్తుతం హౌస్ లో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే, కౌశల్, దీప్తి,గీతా మాధురి, తనీష్,రోల్ రైడా టాప్ 5లో ఉంటారని విశ్లేషకులు ఇప్పటికే అంచనాకొచ్చారు.

ఇక రెండు నామినేషన్స్ ఉన్నందున గీత, రోల్, తనీష్ లు నామినేషన్స్ లోకి రాకపోవచ్చని కొందరు చెప్పేమాట. అలాగే కౌశల్, దీప్తి నామినేషన్స్ లో ఉన్నప్పటికీ రెండు సార్లు సేవ్ అవ్వడం కూడా కష్టం కాకపోవచ్చు. నిజానికి టైటిల్ ఫేవరెట్స్ గా గీతా, తనీష్ లను అనుకున్నారు చాలామంది. ఎందుకంటే వీరిద్దరిలో ఎవరో ఒకర్ని విజేతగా చేస్తారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఓటింగ్ అన్నది ఫైనల్. ఇందులో చీటింగ్ అంటూ జరిగితే,ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడియన్స్ కి తెల్సిపోవడం ఖాయం అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదిలా ఉంటే రెడ్ కార్డు, గోల్డ్ కార్డు, గ్రీన్ కార్డు లను ప్రవేశపెట్టడం ద్వారా ఎవరినీ అసంతృప్తి గురిచేయకుండా షో నుంచి బయటకు సాగనంపుతారని కూడా వ్యూహం రూపొందించారని వినిపిస్తోంది.

మరి కార్డు సిస్టం పెడతారా లేదా అనేది వేచి చూడాలి. కాగా ఆసక్తికరంగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మధు అనే వ్యక్తి కామన్ మ్యాన్ పేరిట ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మరి యితడు చివరి వరకూ ఉంటాడా, సరదాగా ఓ వారమే ఉంటాడా అనేది కూడా చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *