చిరంజీవి పై రాజమౌళి అంచనాలు తారుమారు !

తెలుగు సినిమా పరిశ్రమలో కొందరు ప్రముఖులను జడ్జిమెంట్ కింగ్స్‌ గా చెపుతూ ఉంటారు. ఆప్రముఖులు ఒక్కసారి ఒక సినిమా కథ విని వెంటనే అది హిట్ అవుతుందో లేదో చెప్పేస్తారని అంటూ కొంతమంది అభిప్రాయాల పై ఎప్పటి నుంచో నమ్మకం ఉంది. ఈ లిస్టులో చిరంజీవి అగ్రస్థానంలో ఉంటాడు అంటూ కొద్ది కాలం క్రితం రాజమౌళి ‘విజేత’ ఆడియో ఫంక్షన్ లో కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

అంతేకాదు ‘మగధీర’ సినిమా సూపర్ హిట్ అవుతుందని ముందుగానే కథ విని తనకు చిరంజీవి చెప్పాడు అంటూ రాజమౌళి చిరంజీవిని ‘విజేత’ ఫంక్షన్ లో ఆకాశానికి ఎత్తేశాడు. అయితే అటువంటి చిరంజీవి జడ్జిమెంట్ కళ్యాణ్ దేవ్ ‘విజేత’ కథ విషయంలో ఎందుకు ఫెయిల్ అయింది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కొందరు సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు 1980 కాలంనాటి పాత కథను ఏమాత్రం మార్పులు లేకుండా కొత్త హీరోతో తీస్తే జనం చూడరు అన్న చిన్నవిషయం కూడ చిరంజీవికి తట్టలేదా అంటూ మరికొందరు జోక్ చేస్తున్నారు.

దీనికితోడు ఈమధ్య చిరంజీవి అఖిల్ ‘హలో’ సాయి ధరమ్ తేజ్ ‘తేజ్ ఐ లవ్యూ’ కళ్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమాల ఆడియో ఫంక్షన్స్ కు అతిధిగా వచ్చి ఆసినిమాలు అన్నీ సూపర్ హిట్ అవుతాయని ఓపెన్ గా జోశ్యం చెప్పాడు. అయితే చిరంజీవి జోశ్యం చెప్పిన ఈసినిమాలు అన్నీ ఘోరమైన ఫ్లాప్ లుగా మారడంతో ప్రస్తుతం సినిమాలు చూస్తున్న ఈతరం ప్రేక్షకుల నాడి పట్టడంలో చిరంజీవి కూడ ఫెయిల్ అవుతున్నాడా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈవిషయాలను పట్టించుకోకుండా ‘విజేత’ టాక్ ను పక్కకు పెట్టి తన అల్లుడు కళ్యాణ్ దేవ్ సినిమా సూపర్ అంటూ తన ప్రమోషన్ కొనసాగిస్తూనే ఉన్నాడు.

ఇది ఇలా ఉండగా కళ్యాణ్ దేవ్ ను ప్రమోట్ చేసే బాధ్యత చిరంజీవి నుండి ఇప్పుడు బన్నీ చేతికి వచ్చింది. ‘విజేత’ సక్సెస్ మీట్ పేరిట ఈరోజు జరగబోతున్న ఫంక్షన్ కు అల్లు అర్జున్ అతిధిగా వస్తున్నాడు. ఈసినిమాకు టాక్ ఏమాత్రం బాగుండకపోయినా నిన్న శనివారం కలక్షన్స్ విషయంలో కొంచెం బెటర్ గా ఉండటంతో ఈమూవీకి బన్నీ చేత కూడ పబ్లిసిటీ చేయిస్తే ఏమైనా ఫలితం ఉంటుందేమో అన్న ఉద్దేశ్యంతో ఇప్పుడు అల్లుఅర్జున్ ను కూడ రంగంలోకి దింపుతున్నట్లు టాక్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *