ఎన్టీఆర్ బయో పిక్ లో “చిరు” ?

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నిర్మాతగా,టైటిల్ రోల్ పోషిస్తున్న ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న‌ ‘ఎన్టీఆర్‌’ సినిమా చాలా వేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఎన్టీఆర్ చాలా మందితో పనిచేసారు. కాబట్టి వారి పాత్రలను కూడా సినిమాలో భాగం చేయాలనీ బాలకృష్ణ భావిస్తున్నాడట. ఎన్టీఆర్ జీవితంలో కీలకం అయినా భార్య బసవతారకం పాత్రను విద్యా బాలన్, నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా కనిపించనున్నారు.అంతేకాక ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, హెచ్‌.ఎం. రెడ్డి, చక్రపాణి, ఎస్వీఆర్‌, కృష్ణ, శ్రీదేవి తదితర పాత్రలు ఉన్నట్లు తెలిసింది.కాగా ఎన్టీఆర్‌, చిరంజీవి కలిసి ‘తిరుగులేని మనిషి’ సినిమాలో నటించారు.

వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం కూడా ఉంది. ఈ మేరకు ‘ఎన్టీఆర్‌’లో చిరు పాత్ర కనిపిస్తుందా? లేదా? అనే విషయం ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు ఈ విషయం గురించి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది.

చిరు పాత్ర నిజంగా ఉంటే.. అందులో ఎవరు నటిస్తారు అనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.మరోపక్క ఈ సినిమాలో ఇప్పటికే తారాగణం, అతిథి పాత్రలు ఎక్కువయ్యాయని యూనిట్‌ భావిస్తోందట. మరి కొత్తగా చిరు పాత్ర ఉండబోతోంది అనడంలో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాల్సి ఉంది.

చిరు పాత్ర ఉంటే మెగాస్టార్ అభిమానులు కూడా సినిమాకి బ్రహ్మ రధం పడతారని క్రిష్ బాలకృష్ణకు చెప్పాడట. దాంతో బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘ఎన్టీఆర్‌’ రెండో షెడ్యూల్‌ జరుగుతోంది. సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *