ఢీ 11 లో రేష్మి లేకపోవటానికి కారణం ఎవరో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం

బుల్లితెర మీద షో లలో ఢీ ప్రోగ్రాం కి గల క్రేజ్ వేరు. నిజానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ఇండియాకు రిఫరెన్స్ గా నిల్చిన షో అని చెప్పక తప్పదు. ముఖ్యంగా ఈ షోలో సుధీర్ – రేష్మి కాంబినేషన్ కి మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అయింది . వీళ్ళ జంటకు క్రేజ్ అంతా ఇంతా కాదు అనేలా మారింది. అయితే ఢీ లెవెన్ ప్రోమోలో రేష్మి లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది . నిజం చెప్పాలంటే తెలుగు టివి రంగంలో డాన్స్ షో లకు సంబంధించి రారాజుగా వెలుగొందుతోన్న ఢీ అంటే నిజంగా డీ యే.

ఇప్పటిదాకా విజయంతంగా 10 సీజన్స్ పూర్తిచేసుకున్న ఢీ ఇప్పుడు 11వ సీజన్ కి రెడీ అవుతోంది. అసలు ఇన్ని సీజన్స్ సాగడం నిజంగా ఓ రికార్డ్. 11వ సీజన్ ప్రోమో విడుదలై, సంచలనం సృష్టిస్తోంది. ప్రోమో లో పెద్దగా మార్పు అంటూ ఏదీ లేకున్నా కీలకమైన రేష్మి మాత్రం కనిపించలేదు.

ఇక సుధీర్ షోలోకి ఎంట్రీ ఇచ్చి,’బాడీ మొత్తం ఫిక్స్ అయితే ఎలా ఉంటుందో తెలుసా,ఓ అందగాడు నీకు 5అడుగుల దూరంలో నిలిస్తే ఎలా ఉంటుందో తెలుసా’అంటూ యాంకర్ ప్రదీప్ కి సీరియస్ గా సుధీర్ డైలాగ్ చెప్పాడు. ఇలా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సమయంలో దీనికి కౌంటర్ గా ఓ అందమైన లేడి వాయిస్ తో ‘ఒరేయ్, ఓ అందమైన అమ్మాయి ఆవేశంతో వస్తే ఎలా ఉంటుందో తెలుసా’అంటూ ఆమె స్టేజి మీదికి ఎంట్రీ ఇచ్చేసింది.

అయితే ఇంతగా ఆకట్టుకునే ఆ వాయిస్,ఆ లేడి స్ట్రక్శ్చర్ చూస్తే రేష్మి వి కావని ఎవరైనా చెప్పేయొచ్చు. దీంతో ఈసారి ఢీ లెవెన్ లో ఢీ అంటే ఢీ కొట్టబోతున్న ఈ గాళ్ ఎవరు అని అందరూ చర్చించుకుంటున్నారు. సుధీర్ – రేష్మి జోడీని విడగొట్టి ఢీ లెవెన్ జోడీని నిర్వాహకులు నిర్వహించ బోతున్నారని టాక్. అయితే ఇది ఎంతవరకూ నిజమో ,అసలు ఆ ప్రోమోలో ఉన్న అమ్మాయి ఎవరో ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *