గీతా గోవిందంలో లిప్ లాక్స్.. అర్జున్ రెడ్డి హవా కంటిన్యూస్..!

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండకు యూత్ లో ఎంత ఫాలోయింగ్ ఏర్పడింది అన్నది అందరికి తెలిసిందే. ఆ ఒక్క సినిమా మనోడిలోని టాలెంట్ చూపించేసింది. అందుకే ఏ యువ హీరోకి రాని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ హీరోగా వస్తున్న సినిమా గీతా గోవిందం.

ఈ సినిమాలో కన్నడ భాష రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. సినిమా ట్రైలర్ లో మేడం మేడం అంటూ వెంటపడుతున్నా సినిమాలో ఈ ఇద్దరి రొమాన్స్ పీక్స్ అని అంటున్నారు. గీతా గోవిందం అనే క్లాస్ టైటిల్ పెట్టినా ఈ సినిమాలో కూడా లిప్ లాక్ సీన్స్ ఉన్నాయట. ఛలో సినిమాతో అలరించిన రష్మిక ఈ సినిమాలో విజయ్ తో లిప్ లాక్స్ చేసిందని తెలుస్తుంది.

సినిమా రిలీజ్ కు ముందే గుంటూరు కాలేజ్ స్టూడెంట్స్ దగ్గ ఈ సినిమా లీక్ వీడియో ఉంది. అందులో విజయ్, రష్మిక రొమాన్స్ హైలెట్ అని అంటున్నారు. అర్జున్ రెడ్డిలా రచ్చ చేయకుండా ఒక సన్నివేశంలో విజయ్ రష్మికల లిప్ లాక్ ఉంటుందట. ఆ సీన్ యూత్ ఆడియెన్స్ కు తెగ నచ్చేస్తుందని అంటున్నారు.

కన్నడ కిరాక్ పార్టీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన రష్మిక తెలుగులో మొదటి సినిమా ఛలోలో చాలా పద్ధతిగా కనిపించింది. గీతా గోవిందం సినిమాలో కూడా సినిమా అంతా ఓకే కాని ఒక లిప్ లాక్ సీన్ లో మాత్రం అమ్మడు అదరగొట్టిందని టాక్. మరి విజయ్ మళ్లీ యూత్ మంత్రం వేస్తూ వస్తున్న ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *