దేవదాసు సినిమాపై కౌశల్ ఆర్మీ సంచలన నిర్ణయం….సినిమా పరిస్థితి ఏమిటో?

గతంలో తమ తమ అభిమాన హీరోల మూవీస్ ఒకే రోజు విడుదలైతే అభిమానుల మధ్య పోటీ తారాస్థాయిలో ఉండేది. పోటాపోటీగా కట్ అవుట్ లు కట్టడం,పాలాభిషేకాలు చేయడం ఉండేవి. ఇక ఒకరి హీరోని ఒకరు దూషించడం షరా మామూలే. కానీ ఈ మధ్య కాలంలో ఒక హీరో సినిమా విడుదలవుతుంటే, మరో హీరో ఫాన్స్ బ్యాడ్ టాక్ తేవడానికి ముందునుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో రెచ్చిపోతూ సినిమాలు బ్యాడ్ టాక్ తేవడం అలవాటైపోయింది.

ఆ మధ్య పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ విడుదలకు ముందు మహేష్ అభిమానులు ఇలాగే రెచ్చిపోతే,మహేష్ నటించిన బ్రహ్మోత్సవం మూవీ సమయంలో కూడా పవన్ అభిమానులు అలానే చేసారు. సోషల్ మీడియా ద్వారా బ్యాడ్ టాక్ తెచ్చి ఏం సాధించారో వాళ్ళకే తెలియాలి. సినిమా నిజంగా బాగుంటే, విజయాన్ని ఎవరూ ఆపలేరు. చూసేవాళ్ళు చూస్తారు. చూడని వాళ్ళు చూడరు. ఒక్కోసారి బ్యాడ్ పబ్లిసిటీ కూడా కలిసొచ్చి, కలెక్షన్స్ కూడా ఊపందుకున్న సందర్భాలు ఉన్నాయి.

ఇక తాజాగా బిగ్ బాస్ సీజన్ టు లో కంటెస్టెంట్ కౌశల్ కి అనుకూలంగా ఏర్పడిన కౌశల్ ఆర్మీ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. చివరకు బిగ్ బాస్ పై కూడా కామెంట్స్ చేయడం,దానికి నాని ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చుకోవడం తెల్సిందే. 2కె రన్ లాంటి కార్యక్రమాలతో జనంలోకి కౌశల్ ఆర్మీ దూసుకెళ్లింది. కాగా ఇటీవల కౌశల్ పై బిగ్ బాస్ చేసిన కామెంట్స్ నేపథ్యంలో కౌశల్ ఆర్మీ మరింత రెచ్చిపోతున్నారు.

నాని నటించిన దేవదాస్ చిత్రాన్ని టార్గెట్ చేస్తామని కౌశల్ ఆర్మీ సోషల్ మీడియాలో మెసేజ్ లు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
తాము తలచుకుంటే దేవదాస్ మూవీని ప్లాప్ చేస్తామని కూడా కౌశల్ ఆర్మీ మెసేజ్ లతో హెచ్చరిస్తోంది. అయితే నాని ఫాన్స్ ధీటుగా స్పందిస్తూ,’మీరు ఏమి చేసినా సినిమా చూసేవాళ్ళు చూస్తారు.

చూడని వాళ్ళు చూడరు’అంటూ రివర్స్ లో కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బుల్లితెర మీద సాగే షో కోసం పుట్టిన అభిమాన ఫాన్స్ ఇప్పుడు బిగ్ స్క్రీన్ ని ఢీ కొంటోంది. చూద్దాం ఏమిజరుగుతుందో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *