కౌశల్ ఆర్మీ నిజమా ? ఫేకా? నమ్మలేని నిజాలు

తెలుగు బుల్లితెరను, సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్నాడు కౌశల్. ఒక సాధారణ పార్టిసిపెంట్ కారణంగా ఒక పెద్ద రియాల్టీ షో కే మంచి పేరు రావచ్చని నిరూపించాడు కౌశల్. దీనికి కారణం కౌశల్ ఆర్మీ. ఇప్పుడు కౌశల్ ని కౌశల్ ఆర్మీ కంటికి రెప్పలా కాపాడుతూ వస్తుంది. ఒక సాధారణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి 50 రోజుల్లో ఇంత ఫాలోయింగ్ ఎలా సాధ్యం? ఇదంతా ఫేక్ అనే వార్తలు వస్తున్నాయి. కౌశల్ షో లోకి రాకముందే సోషల్ మీడియాలో ఫేక్ ID లతో తనను బాగా పాపులర్ చేసేలా పెద్ద SEO తో ఒప్పందం కుదుర్చుకున్నాడని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. నిజానికి ఆ వాదన వంద శాతం తప్పు. ఎందుకంటే ఒక SEO టీం ఒక వ్యక్తిని కొంత పరిధిలోనే ఫెమస్ చేయగలరు.

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పేస్ బుక్,ట్విట్టర్ లలో ఫేక్ ID లకు పెద్దగా స్కోప్ లేదు. ఇప్పుడు ఎవరైతే కౌశల్ ఆర్మీగా మారారో,కౌశల్ ని తమ భుజాలపై ఉంచుకున్నారో వారందరూ కౌశల్ వ్యక్తిత్వం నచ్చి వచ్చినవారే. అందుకే వారు చాలా ఎక్కువగా కౌశల్ కి సంబంధించి పోస్ట్స్ పెడుతున్నారు. ఇలాంటి జెన్యూన్ ఫ్యాన్స్ ఉన్నంత వరకు కౌశల్ ని బిగ్ బాస్ హౌస్ లో ఎవరు టచ్ చేయలేరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *