ఫ్రెండ్ షిప్ డే సందర్భంలో సంచలన నిర్ణయం తీసుకున్న కౌశల్…అది ఏమిటో తెలుసా?

ఒక మనిషికి ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా స్నేహితుడు ఉంటే చాలని అందరు భావిస్తూ ఉంటారు. స్నేహానికి జాతి,కుల,మత భేదాలు ఏమి ఉండవు. అందుకే ఆగస్ట్ 5 న ఫ్రెండ్ షిప్ డే జరుపుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారందరు బయట ఉన్నప్పుడు ఫ్రెండ్ షిప్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొనేవారు. అందుకే బిగ్ బాస్ హౌస్ లో కూడా ఫ్రెండ్ షిప్ డే ని జరుపుకుంటున్నారట. కౌశల్ కూడా ఈ ఫ్రెండ్ షిప్ డే ని విన్నూతనంగా జరుపుకోవాలని డిసైడ్ అయ్యాడట. బిగ్ బాస్ హౌస్ లో ఉండేవారికి బయట ఏమి జరుగుతుందో, ఎప్పుడు ఏ పండుగ వస్తుందో తెలియదు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి మరల హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు హౌస్ మేట్స్ కి ఫ్రెండ్ షిప్ డే గురించి చెప్పినట్టు తెలుస్తుంది.

ఈ సందర్భంగా కౌశల్ ఒక నిర్ణయం తీసుకున్నాడట. హౌస్ లో ఉన్న అందరితోనూ స్నేహంగా ఉండాలని భావిస్తున్నాడట. ఎటువంటి గొడవలు,వివాదాలు లేకుండా అందరితోనూ స్నేహంగా ఉండాలని కౌశల్ నిర్ణయం తీసుకున్నాడట. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి 50 రోజులు దాటినా నూతన్ నాయుడు తప్పించి మరో స్నేహితుడు లేకపోవటం కౌశల్ ని ఆలోచనలో పాడేసింది.

దాంతో ఈ నిర్ణయం తీసుకున్నాడట. తనీష్,సామ్రాట్,గీతా మాధురి సినీ పరిశ్రమలో పరిచయం ఉన్నా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక యాంటీగా మారిపోయారని కౌశల్ నూతన నాయుడుతో చెప్పి ఫ్రెండ్ షిప్ డే నుంచి కొత్త కౌశల్ ని చూస్తారని అన్నాడట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *