మహేష్ బాబు ‘మహర్షి’ ఫస్ట్ లుక్ లో ఈ నాలుగు తేడాలు గమనించారా?

మహేష్ బాబు అభిమానులు ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. మహేష్ తన 25 వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి టైటిల్ ఏమి పెడతారా అని అభిమానులు ఎదురు చూస్తున్న తరుణంలో, ఈ రోజు ఆగస్టు 9 గురువారం మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మహర్షి అని టైటిల్ ని కూడా రివీల్ చేసారు. ఈ సినిమాకి రిషి అని టైటిల్ పెడుతున్నారని ప్రచారం సాగింది. బ్లాక్ బస్టర్ హిట్ అయినా భరత్ అనే నేను సినిమా తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా కావటంతో అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అలాగే మహేష్ తన 25 వ సినిమా కావటంతో ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటున్నాడు. లేటెస్ట్ గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ని చూస్తే ఎన్నో విషయాలు అర్ధం అవుతాయి.

మహేష్ 25 వ సినిమాకి రిషి అని టైటిల్ పెడతారని ప్రచారం సాగింది. అయితే మహేష్ కి రెండు అక్షరాల సినిమా పేర్లు అచ్చి రావని గత సినిమాలు చూస్తేనే అర్ధం అవుతుంది. మూడు అక్షరాల టైటిల్ బాగా కలిసి వచ్చింది. అందుకే మూడు అక్షరాలతో మహర్షి అని పేరుని ఫిక్స్ చేసారు.ఈ సినిమాలో మహేష్ లుక్ కూడా విభిన్నంగా ఉంటుందని మొదటి నుంచి చెప్పుతున్నారు.

ఫస్ట్ లుక్ చూడగానే అది నిజమే అని అనిపించింది. పక్కా కాలేజ్ కుర్రాడి గెటప్ లో ఉన్న మహేష్ బాబు పది సంవత్సరాలు చిన్నగా కనిపిస్తున్నాడు. అంతేకాక సినిమాలో ఎక్కువ భాగం హాఫ్ హ్యాండ్ షర్ట్ తో కనిపించనున్నాడని ఫస్ట్ లుక్ చూస్తే అర్ధం అవుతుంది. మహేష్ ఎక్కువగా సినిమాల్లో ఫుల్ హ్యాండ్ షర్ట్ తోనే నటించేవాడు.

ఒకవేళ హాఫ్ హ్యాండ్ వేయవలసి వస్తే రౌండ్ నెక్ టీ షర్ట్స్ వేసుకొనేవాడు. ఆ సేంట్ మెంట్ ని పక్కన పెట్టేసి ఇప్పుడు హాఫ్ హ్యాండ్ షర్ట్ ని ఈ మహర్షి సినిమాలో వేసుకుంటున్నాడు. కాలేజ్ కుర్రాడు అంటే చేతిలో పుస్తకం ఉండాలి. అయితే ఇక్కడ మహేష్ బాబు కాబట్టి చేతిలో లాప్ టాప్ తో హల్ చల్ చేస్తున్నాడు. షూ విషయంలో కూడా శ్రద్ద పెట్టినట్టు అర్ధం అవుతుంది.

జీరో సోల్ ఉన్న కాన్వాస్ షూ ఉపయోగించాడు. బాగా పెరిగిన జుట్టును రివర్స్ ట్రెండ్ లో దువ్వేసి మీసం,గడ్డంతో న్యూ లుక్ తో మహేష్ కనపడుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *