‘ గీత గోవిందం ‘ మూవీ పట్ల మహేష్ స్పందన..

మహేష్ బాబు ఫ్యామిలీ పర్శన్. కొంచెం తీరిక దొరికినా పిల్లలకు సమయం కేటాయిస్తారు. ఇలా పిల్లలతో హాయిగా గడిపిన ఫొటోస్ ని అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఓ క్యుట్ ఫోటోని నమ్రత అభిమానులతో పంచుకున్నారు.

తన పిల్లలు గౌతమ్, సితారలను మహేష్ ఎంత గారాబంగా పెంచుతున్నారో గతంలో ఎన్నోసార్లు సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో చెప్పిన నమ్రత.. తాజాగా.. తాను కాదన్న వారి కోరికను తీర్చుకునేందుకు తండ్రి వద్ద పంచాయితీ పెట్టారని తెలుపుతూ ఓ పోస్టు చేసింది. అయితే, తను ఏం వద్దని చెప్పింది? వారు ఏం కావాలని అడిగారు? అన్న విషయాలు మాత్రం చెప్పలేదు.

మహేష్ ప్రస్తుతం మహర్షి సినిమాతో బిజీగా వున్నారు. మహేశ్‌-వంశీపైడిపల్లి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇటివలే ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో మహేశ్ స్టూడెంట్‌లా స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్తూ పక్కన అమ్మాయి కనపడగానే ఆమెను వెనక్కి తిరిగి చూసిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *