‘మా’ కు షాక్ ఇచ్చిన మహేష్ బాబు

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ‘మా’ మరో వివాదంలో చిక్కుకుంది. సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో ‘మా’ నిధులు దుర్వినియోగం చేశారంటూ వస్తున్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి . తాను ఒక్క పైసా దుర్వినియోగం చేసినట్టు నిరూపిస్తే, తన ఆస్తి మొత్తాన్నీ పరిశ్రమకు రాసిచ్చేస్తానని ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా సవాల్ విసరడం, దీనికి మా కార్యదర్శి, సీనియర్ నటుడు నరేశ్ మళ్ళీ కౌంటర్ ఇవ్వడం రచ్చ రచ్చ అయింది. ప్రస్తుతం అసోసియేషన్ రెండుగా చీలిపోయి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి.

కాగా ఈ వివాదంలో తన పేరు ప్రస్తావనకు రావడంతో మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. మరోవైపు అక్టోబర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ ఈవెంట్ ను ‘మా’ సభ్యులు ఫిక్స్ చేశారు. అయితే, వివాదం నేపథ్యంలో ఈవెంట్ ను మహేష్ బాబు క్యాన్సిల్ చేసుకున్నట్టు ఫిలింనగర్ టాక్. మొత్తంమ్మీద మా తన పరువు తానే తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *