మా అసోసియేషన్ వ్యహారం పై మంచు మనోజ్ షాకింగ్ సెటైర్లు !

మా అసోసియేషన్ ఆర్ధిక వ్యవహారాల నిర్వహణలో అక్రమాలు జరిగాయి అంటూ ఈమధ్య వివాదాలు ముదిరిన నేపధ్యంలో ప్రస్తుతం ఈపంచాయితీ చిరంజీవి చెంతకు చేరి ఈవ్యవహారంలో ‘పెదరాయుడు’ పాత్రను పోషించవలసిందిగా చిరంజీవి పై ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. ఈపరిస్తుతుల నేపధ్యంలో ఈవ్యవహారం పై మంచు మనోజ్ వేసిన సెటైర్లు హాట్ టాపిక్ గా మారాయి.

ప్రస్తుతం చేయడానికి సినిమాలు లేక ఖాళీగా ఉన్న మంచు మనోజ్ తన ఖాళీ సమయాన్ని ట్విట్టర్ ఫేస్ బుక్ లలో యాక్టివ్ గా ఉంటూ సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో మనోజ్ ఈమధ్య తన అభిమానులతో సోషల్ మీడియాలో ఛాట్ చేస్తున్నప్పుడు ఒక విచిత్రమైన ప్రశ్న ఎదురైంది.

ఒక అభిమాని మనోజ్ కు ట్విట్ చేస్తూ ఒక విచిత్రమైన కామెంట్ చేసాడు. ‘మా అసోసియేషన్ కు నిన్ను ప్రెసిడెంట్ గా చూడాలని ఉంది బ్రో’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి మనోజ్ కూడా అంతే సెటైరికల్ గా సమాధానం ఇచ్చి తన తెలివితేటలను చాటుకున్నాడు. తాను ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరిస్తే అందరికీ ‘ఫసక్’ అంటూ ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో తన తండ్రి మోహన్ బాబు వాడిన పంచ్ డైలాగ్ ను రిపీట్ చేసాడు.

అంతేకాదు ప్రస్తుతం మా అసోసియేషన్ ను చుట్టుముడుతున్న విమర్శలకు అందరు కలిసికట్టుగా ఎదిరించి పోరాడుతారనీ విమర్శలకు భయపడి పారి పోవడానికి ‘మా’ సంస్థ సభ్యులు చికెన్స్ కారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. మనోజ్ కామెంట్స్ లో ఆత్మ స్థైర్యం కనిపిస్తూ ఉన్నా మా సంస్థకు అధ్యక్షుడుగా మనోజ్ ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన నిజం అయితే మా సంస్థకు యువ నాయకత్వం అందించగల కోలీవుడ్ విశాల్ మన మా సంస్థకు కూడా దొరికినట్లు అవుతుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *