బిగ్ బాస్ వల్ల నానికి అగచాట్లు..!

ఇప్పడూ జరుగుతున్న బిగ్ బాస్ 2 ప్రేక్షకుల నుంచి చాలా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. లాస్ట్ టైం ఎన్టీఆర్ హోస్ట్ చేసినప్పుడు ఎటువంటి విమర్శలకు తావులేకుండా ఎన్టీఆర్ షో ను నడిపించారు అయితే ఇప్పుడు నాని ప్రతి దానికి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బిగ్‌బాస్ సీజ‌న్‌-2 నిర్వహ‌ణ తీరుపై ప్రేక్షకుల నుంచి పెద్దఎత్తున విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ప‌నిలో ప‌నిగా బిగ్‌బాస్‌ హోస్ట్ నానికి కూడా సోష‌ల్ మీడియా నుంచి విమ‌ర్శల సెగ త‌ప్పలేదు.

దీంతో నాని షాక్‌కు గురై “అయ్య బాబోయ్ నాకేం తెలియ‌దు… అంతా బిగ్‌బాసే చూసుకుంటారు. నేను నిమిత్త మాత్రుని” అంటూ చేతులెత్తేశారు. దీనంత‌టికి బిగ్‌బాస్ షో నిర్వాహ‌కుల త‌ప్పిద‌మే కార‌ణం. ఒక త‌ప్పు చేస్తే దాన్ని స‌రిదిద్దుకోవాల్సింది పోయి… త‌ప్పు మీద త‌ప్పు చేస్తూ స్టార్ మాటీవీ విమ‌ర్శల‌ను మూట‌క‌ట్టుకుంటోంది. సోష‌ల్ మీడియా ద్వారా నాని ఇచ్చిన వివ‌ర‌ణ‌ను ఒక్కసారి ప‌రిశీలిద్దాం. “బిగ్‌బాస్ హోస్ట్‌గా నేను హౌస్‌లో ఉన్నవారంద‌రినీ స‌మానంగానే చూస్తాను. హౌస్‌మేట్స్ అంద‌రినీ ఒకేలా ట్రీట్ చేస్తాను. ఎవ‌రైతే అత్యుత్తమ ప్రద‌ర్శన ఇస్తారో వాళ్లే ప్రేక్షకుల మ‌ద్దతుతో విజేత‌లుగా నిలుస్తారు.

ఓటింగ్‌, ఎలిమినేష‌న‌ల్‌ల‌లో నా ప్రమేయం ఉంద‌ని మీలో ఎవ‌రైనా అనుకుంటే అది మీ విచ‌క్షణ‌కే వ‌దిలేస్తాను. న‌న్ను ప్రేమించినా, ద్వేషించినా ప్రేక్షకులే నా కుటుంబ స‌భ్యులు. న‌న్ను అపార్థం చేసుకోవ‌ద్దు” అని నాని ఇచ్చిన వివ‌ర‌ణ చ‌దివితే అత‌నిపై సానుభూతి క‌ల‌గ‌క‌మాన‌దు. ఎవ‌రైతే అత్యుత్తమ ప్రద‌ర్శన ఇస్తారో వాళ్లే ప్రేక్షకుల మ‌ద్దతుతో విజేత‌లుగా నిలుస్తార‌ని నాని చెప్పినంత నిజాయ‌తీ ఆచ‌ర‌ణ‌లో క‌నిపించ‌డం లేదు. అస‌లు స‌మ‌స్యే ఇక్కడ మొద‌లైంది. బిగ్‌బాస్ హౌస్ స‌భ్యులు శ్యామ‌ల‌, నూత‌న్‌నాయుడుల‌ను ప్రేక్షకులే క‌దా ఇక చాలు అని బిగ్‌బాస్ హౌస్ నుంచి ఇంటికి పంపింది. మ‌రి ఏ ప్రాతిప‌దిక‌న మ‌ళ్లీ వారిని బిగ్‌బాస్ హౌస్‌లోకి రప్పించుకున్నారో నాని స‌మాధానం చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *