షాకింగ్ న్యూస్ : నాని బిగ్ బాస్ ని వదిలేస్తున్నాడా? కారణం ఏమిటో తెలుసా?

బిగ్ బాస్ రెండో సీజన్ తెలుగులో ప్రారంభం అయ్యి రెండు వారాలు గడుస్తున్న TRP రేటింగ్స్ డల్ గానే ఉంటున్నాయి. నాని కోసం శని,ఆదివారాల్లో షో చూసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆ రోజుల్లో మాత్రమే TRP రేటింగ్స్ బాగా ఉంటున్నాయి. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. నాని బిగ్ బాస్ యజమాన్యంతో గొడవ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఏ విషయం మీద గొడవ పడ్డారో అనే విషయం మీద క్లారిటీ లేదు. అయితే నాని బిగ్ బాస్ ని వదిలి వెళ్ళిపోతా అనే రేంజ్ దాక గొడవ వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో నాని మీద వచ్చే ట్రోలింగ్స్ కూడా ఒక కారణం అని కథనాలు వస్తున్నాయి.

నిజానికి తెలుగు బిగ్ బాస్ రెండో సీజన్ లో బలమైన మరియు పేరున్న సెలబ్రెటీలు ఎవరు లేరు. అందుకే నాని వచ్చే శని,ఆదివారం మాత్రమే ఎక్కువ మంది చూస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ కి నాని ప్లస్ అనే చెప్పాలి. నానికి బిగ్ బాస్ యాజమాన్యానికి జరిగిన గొడవ పెద్దది కాకుండా మధ్యవర్తులు సర్ది చెప్పారట.

అయితే ఎన్టీఆర్ తో పోలిస్తే నాని బాగా చేయటం లేదనే టాక్ కూడా జనాల్లో బాగా ఉంది. నాని తన శాయిశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే మొదటికి ఇప్పటికి చాలా ఇంప్రూవ్ అయ్యాడు నాని. చూద్దాం ముందు ముందు ఏమి అవుతుందో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *