నీవెవరో టీజర్ అదిరింది…

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ హీరో హీరోయిన్స్‌గా నటిస్తోన్న చిత్రానికి ‘నీవెవరో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి.సినిమా పతాకాలపై హరినాథ్‌ దర్శకత్వంలో కోన వెంకట్‌, ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ని స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ విడుదల చేసి సినిమా ఫై హైప్ పెంచగా , తాజాగా ఆదివారం ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను యూట్యూబ్ లో విడుదల చేశారు.

టీజర్ చూస్తుంటే ఈ చిత్రం సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కినట్లు అర్ధం అవుతుంది. ‘ఇది ప్రమాదం కాదు సర్‌.. ఇది హత్య’ అంటూ ఓ మహిళ పోలీసులకు చెబుతుంది. ‘ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకు సమాధానం ఏదో ఒక రూపంలో వస్తుంది. నాకు ఏ రూపంలో వస్తుందో చూడాలి’ అంటూ ఆది పినిశెట్టి తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ‘వీడ్ని స్కెచ్‌ వేసి చంపింది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్‌‌ ట్రంప్‌, నార్త్‌ కొరియా ప్రెసిడెంట్‌ కిమ్‌. కిమ్‌ అయినా.. ట్రంప్‌ అయినా లోపలేసి కుమ్ముతా’ అంటూ తనలోని హీరోయిజాన్ని వెన్నెల కిశోర్ చెప్పే తీరు నవ్వులు పూయిస్తుంది. ఓవరాల్ గా ఈ టీజర్ తో ఈ మూవీ ఫై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్‌, ఆర్ట్‌: చిన్నా, ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *