యంగ్ టైగర్ కోసం తల్లి ఏమి చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఎన్టీఆర్ కి ఈ స్థాయికి రావటానికి ఎన్టీఆర్ తల్లి షాలిని ప్రముఖమైన పాత్రను పోషించింది. చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ లో ఉన్న ఇష్టాలను గమనించి సంగీతం,డాన్స్,యాక్టింగ్ లో శిక్షణ ఇప్పించింది. అందుకే ఎన్టీఆర్ కి తల్లి అంటే చాలా ఇష్టం. అంతేకాక సందర్భం వచ్చిన ప్రతి సారి తనకు తల్లి తర్వాతే ఎవరైనా అని చెప్పుతూ ఉంటాడు. ంటే తల్లికి చాలా ప్రాధాన్యత ఇస్తాడు. కొడుకు కోసం షాలిని చాలా త్యాగాలు చేసింది.

ఇపుడు త్వరలో విడుదల అయ్యే అరవింద సమేత వీర రాఘవ సినిమా కోసం పూజలను చేసినట్టు వార్తలు వస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని సీసిలి సాయిబాబా గుడిని షాలిని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సాయిబాబాకు హారతి ఇస్తోన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫొటోను ఎన్టీఆర్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను మరో నాలుగు రోజుల్లో రిలీజ్ చేసేందుకు యూనిట్ సిద్ధమైంది. ‘అజ్ఞాతవాసి’తో అపఖ్యాతి తెచ్చుకున్న త్రివిక్రమ్ ఈ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తల్లి షాలిని తన కొడుకు తాజా చిత్రం హిట్ కావాలని పూజలు చేసిందని ఎన్టీఆర్ అభిమానులు ఆ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు. ఎంతైనా తల్లి ప్రేమ ఇదే అంటూ కొనియాడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *