విజయ్ దేవరకొండకు ఊహించని మంచిచేసిన పవన్ అదృష్టం !

సంచలనాలు కలిగించిన ‘గీత గోవిందం’ సినిమా రా ఫుటేజ్ లీక్ వ్యవహారం ఒక విధంగా ఆసినిమాకు ఊహించని మంచి చేసింది అన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈసినిమాతో పాటు మరికొన్ని సినిమాల ఫుటేజ్ లు కూడా లీక్ అయినా జనం మధ్య హడావిడి చేసింది మాత్రం ‘గీత గోవిందం’ లీక్డు సీన్స్ మాత్రమే.

ఏ సినిమాకైనా లీక్ అన్నది ఒక సమస్య అయినా ‘గీత గోవిందం’ కు అది అదృష్టంగా మారింది అన్న కామెంట్స్ విని పిస్తున్నాయి. ఈమూవీకి సంబంధించిన లీకులు కొన్ని వాట్సప్ లో చలామణీ అవుతున్నాయి. అయితే ఇవన్నీ పక్కా రా ఫుటేజ్ లు. అంతంతమాత్రం క్లారిటీతో డైలాగ్ మిక్సింగ్ లేకుండా వున్నాయి.

అయితే లీక్ సీన్స్ అన్నీ యూత్ ఫుల్ గా పక్కా విజయ్ దేవరకొండ ఇమేజ్ కు మ్యాచ్ అయ్యేలా ఉండడంతో ఈ ఫుటేజ్ లు చూసిన యూత్ ఈమూవీ పై మరింత అంచనాలు పెంచుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో గీతా సంస్థకు ‘గీత గోవిందం’ విషయంలో టెన్షన్ పడనక్కరలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నిజానికి నిన్న ఈ మూవీకి సంబంధించి మరో ట్రైలర్ విడుదల చేయాలి అనుకున్నారు. అయితే డీటీఎస్ మిక్సింగ్ చేయించే టైమ్ లో ఈలీకుల గోల మొదలుకావడంతో ఈ ట్రయిలర్ ఆలోచనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ మూవీ విడుదలకు ముందు ఇలాంటి లీకుల సమస్య వచ్చి సంచలనాలు జరిగిన తరువాత ఆమూవీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపధ్యంలో అలాంటి అదృష్టమే ‘గీత గోవిందం’ కు పట్టినా ఆశ్చర్య పడనక్కరలేదు అంటూ మరికొందరి కామెంట్స్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *