ఎన్టీఆర్ విషయంలో రాజమౌళి మౌనం..

దర్శక ధీరుడు రాజమౌళి తన సినిమా పట్ల మాత్రమే కాదు వేరే దర్శకుల సినిమాల పట్ల కూడా తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంటాడు..ఇప్పటికే పలు సినిమాల పట్ల పాజిటివ్ గా ట్వీట్స్ పెట్టి ఆయా సినిమాల విజయాలలో పాలుపంచుకున్నారు. అయితే ఎన్టీఆర్ సినిమా విషయంలో మాత్రం సైలెంట్ గా ఉండడం ఎన్టీఆర్ అభిమానులను బాధ కలిగిస్తుంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వం లో అరవింద సమేత అనే సినిమా చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ బయటకొచ్చి అందరి ప్రశంసలు అందుకుంది. అయితే ఈ టీజర్ ఫై రాజమౌళి ఇప్పటి వరకు స్పందించకపోయేసరికి అభిమానులు కాస్త ఫీల్ అవుతున్నారు.

ఎన్టీఆర్ – రాజమౌళి చాల క్లోజ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. అదికాక త్వరలో వీరిద్దరూ కలిసి సినిమా కూడా చేయబోతున్నారు. అలాంటప్పుడు రాజమౌళి టీజర్ ఫై స్పందించక పోవడం కాస్త అందరిని ఆలోచనలో పడేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *