రానా ఆరోగ్య పరిస్థితి ఎవరికీ అర్ధం కావటం లేదు…అసలు రానాకు ఏమైందో?

ప్రస్తుతం టాలీవుడ్ లో అన్ని రకాల పాత్రలను పోషించే యంగ్,డైనమిక్ నటుడు ఎవరంటే టక్కున రానా పేరు చెప్పుతారు. హీరో,విలన్,సపోర్టింగ్ రోల్,గెస్ట్ రోల్ ఇలా ఏ పాత్ర అయినా నటించి మెప్పించగల నటుడు రానా. బాహుబలి సినిమాతో రానా ఖ్యాతి ప్రపంచవ్యాప్తం అయింది. చేసిన ప్రతి సినిమాలోనూ వైవిధ్యం ఉండేలా చూసుకున్నాడు. రానా తన మొదటి సినిమా లీడర్ నుంచి ఇదే విధానాన్ని అవలంబిస్తున్నాడు. బాహుబలి సినిమాలో విలన్ గా నటించి మెప్పించి ఆ తర్వాత నేనే రాజు నేనే మంత్రి సినిమాలో హీరోగా నటించి సక్సెస్ అవ్వటం రానా ఒక్కడికే చెల్లిందని చెప్పవచ్చు. అయితే గత కొన్ని రోజులుగా రానా ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

రానా ఆరోగ్య పరిస్థితిపై సినీ వర్గాల్లోనే క్లారిటీ లేదు. రానా ఆరోగ్యం ఎలా ఉంది. అసలు రానా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అనే విషయం మీద విపరీతమైన చర్చ సాగుతుంది. రానాకు ప్రధానంగా కంటి చూపు సమస్య ఉన్నట్టు అయన కుటుంబ సభ్యులు చెప్పుతున్నారు.

రానా కూడా ఒక ఇంటర్వ్యూలో అదే విషయాన్నీ చెప్పాడు. అయితే మెరుగైన చికిత్స కోసం విదేశాలకు వెళ్లాలని అనుకున్నప్పుడే సందేహాలు మొదలు అయ్యాయి. విదేశాలకు రానా వెళ్లుతున్నాడని తెలియగానే రానా ఆరోగ్యంపై అనేక రకాల పుకార్లు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాల ప్రకారం రానాకి కిడ్నీ సమస్య ఉందట. అత్యవసరంగా ఒక కిడ్నీ మార్చాలని డాక్టర్స్ చెప్పారట.

రానా తల్లి కిడ్నీ ఇవ్వటానికి సిద్ధం అయినా ఆమె వయస్సు దృష్ట్యా రానా వద్దని వారించాడట. ప్రస్తుతం కిడ్నీ ఇచ్చే దాత కోసం దగ్గుపాటి కుటుంబం అన్వేషిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం రానా కమిట్ అయినా ప్రాజెక్ట్స్ కూడా ఆగిపోయాయట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *