నయన్ పై సమంత కామెంట్స్

బేసిగ్గా హీరోయిన్స్ స్టార్ టైం చాలా తక్కువ. ఒక హీరోయిన్ వచ్చిందా.. స్టార్ హీరోలతో జత కట్టిందా మెల్లగా మాయమైపొయిందా.. ఇలా ఉటుంది లెక్క. మహా అయితే ఓ మూడు సంవవత్సరాలు. అయితే ఈ లెక్కను దాటుకొని కొందరు హీరోయిన్స్ నిలబడతారు. ఇందులో నయనతారను చేర్చుకోవచ్చు. నయన ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి నేటి 14 ఏళ్లు పూర్తయింది. ఇప్పటికీ ఆమెనే స్టార్ హీరోయిన్.

ఇప్పుడు లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగుతోంది నయన్. ఇటివలే ‘ఆరం’ సినిమాతో విజయం అందుకున్న నయన్‌ ఇప్పుడు ‘కోళమావు కోకిల’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. డార్క్‌ కామెడీ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా జులై 6న ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. దీని గురించి తాజాగా సమంత ట్విటర్‌ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘కాస్త ఆలస్యమైందని తెలుసు. ‘కోళమావు కోకిల’ ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ధైర్యం చేసి ఈ సినిమాను ఎంపికచేసుకున్నందుకు నయనతారకు, చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌’ అని ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *