శ్యామల చేసిన తప్పు కారణంగానే ఎలిమినేట్ అవుతుందా? ఆ తప్పు ఏమిటో?

భారీ క్రేజ్ తో సాగుతున్న బిగ్ బాస్ సీజన్ 2రియాల్టీ షో తుది దశ కు చేరడంతో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు,ఎవరు విజేత అనే విషయాలు జోరుగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఎవరు సేవ్ అవుతున్నారో అనే విషయాన్ని ఆదివారానికి హోస్ట్ నాని వాయిదా వేసేశాడు. దీంతో బుల్లితెరమీద విపరీతమైన ఫాలోయింగ్ తో నడుస్తున్న బిగ్ బాస్ పై ఉత్కంఠ మరింత పెరిగింది. నాని హోస్ట్ గా నడుస్తున్న బిగ్ బాస్ షో ఇప్పటికే 12వారాలు పూర్తయ్యి,13వ వారం ఎండ్ అవుతోంది. ఇక మరో రెండు వారాల్లో ఈ షో ముగియనున్న నేపథ్యంలో ఇక ఈవారం ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారో ఇంకా తెలికపోయినా శ్యామల ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం హౌస్ లో గల 8మంది కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో వీళ్ళలో కౌషల్, అమిత్,శ్యామల,దీప్తి నామినేషన్ లో వున్నారు . ఇక ఎలిమినేషన్ రౌండ్ వచ్చేయడంతో ఓటింగ్ భారీగా సాగింది. అయితే శ్యామల ఫ్రెండ్ హారిక ఇన్నమూరి ఇన్ స్టా గ్రామ్ ద్వారా పెట్టిన పోస్ట్ చూస్తే శ్యామల ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.

శ్యా .. మల్లా.. అంటూ పెట్టిన పోస్టు లో మల్లా అంటూ ఒత్తి పలుకుతూ చేసిన పోస్టు పరోక్షంగా ఆమె బయటకు వచ్చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ వారం భారీగానే ఓటింగ్ నమోదైంది. ఇందులో విన్నర్ గా నిలుస్తాడని భావిస్తున్న కౌశల్ కి 60శాతం ఓట్లు పోలవ్వగా,తర్వాత స్థానంలో దీప్తి నల్లమోతు సుమారు 20శాతం ఓట్లతో సెకండ్ ప్లేస్ లో నిల్చి సేఫ్ జోన్ లోకి వెళ్ళింది.

ఇక శ్యామల, అమిత్ తివారి లకు పది శాతం చొప్పున ఓట్లు రాగా దీంతో వీళ్ళిద్దరిలో హౌస్ నుంచి బయటకు వెళ్ళేది ఎవరు అనేది మరింత ఉత్కంఠ రేపింది. వాస్తవానికి గతవారమే బయటకు వెళ్లాల్సిన అమిత్ ఈసారి వెళ్లడం ఖాయమనే మాట వినిపించింది. దీనికి కారణం శుక్రవారం సాయంత్రం వరకూ కొంత ఆధిక్యంలో శ్యామల ఉండేది.

గీతా మాధురి, రోల్ రైడా, తనీష్, సామ్రాట్, దీప్తి లకు కౌశల్ ఆర్మీ గురించి శ్యామల చెప్పేసింది. ఇక కౌశల్ కి నూతన్ నాయుడు సపోర్ట్ చేయడాన్ని భరించలేక బయట ఇంటర్యూలో ఆయన చెప్పాడో అవన్నీ కూడా హౌస్ మెంబర్స్ కి చెప్పేసింది. నిజానికి కౌశల్ కి మద్దతుగా నిలుస్తానని చెప్పి హౌస్ లోకి వచ్చిన శ్యామల ఆ తర్వాత సపోర్ట్ చేయలేదు సరి కదా,నూతన్ ని కూడా ఇంటి సభ్యులతో నామినేట్ చేయించి, ఎలిమినేట్ అయ్యేలా చేసేసింది.

అందుకే శ్యామల అంటే కారాలు మిరియాలు నూరుతున్న కౌశల్ ఆర్మీ,శుక్రవారం రాత్రి నుంచి శ్యామలపై అస్త్రాలు సంధించడం స్టార్ట్ చేసారు. అమిత్ కన్నా కొంత ఆధిక్యంలో ఉండే ఆమె సేఫ్ జోన్ లోకి వెళ్తున్న సమయంలో కౌశల్ ఆర్మీ ఓ పట్టు పట్టేసి,హౌస్ నుంచి గెంటేశారు. అమిత్ ని నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి చేర్చేసారు.

సింగిల్ ఎలిమినేట్ అయితే శ్యామల అవుట్ అని వేసిన కౌశల్ ఆర్మీ అంచనా నిజమే అయింది. పలువురి ఎలిమినేషన్ గురించి లీకులు ఇచ్చిన శ్యామల ఫ్రెండ్ హారిక ఇప్పుడు శ్యామల ఎలిమినేషన్ గురించి చెప్పకనే చెప్పేసింది. 13వ వారం మాదిరిగా 14వారం కూడా సింగిల్ ఎలిమినేషన్ ఉండబోతోంది. ఇక గ్రాండ్ ఫినాలే జరిగే ఆఖరి వారం అయిన15వ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉండబోతోందని చెప్పవచ్చు. ఆదివారం గ్రాండ్ ఫినాలేలో మిగిలే 5గురిలో ఎవరు విన్నర్ ఎవరో అంచనా వేసెయ్యండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *