బిగ్ బాస్ హౌస్ రెంట్ రోజుకి ఎన్ని లక్షల్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

బిగ్ బాస్ మొదటి సీజన్ సెట్ ని పూణేలో వేశారు. వారంలో రెండు రోజులు ఎన్టీఆర్ అక్కడికి వెళ్లి హోస్ట్ చేసేవాడు. అయితే రెండో సీజన్ కి వచ్చేసరికి బిగ్ బాస్ సెట్ ని అన్నపూర్ణ స్టూడియోలో వేశారు. బిగ్ బాస్ హౌస్ మరియు బిగ్ బాస్ స్టేజ్ అంతా అన్నపూర్ణ స్టూడియోలోనే వేశారు. నాగార్జునకు స్టార్ మా టివి వారితో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఈ ఒప్పందం జరిగిందని వార్తలు వస్తున్నాయి. నాగార్జున బిగ్ బాస్ హౌస్ సెట్ కోసం స్టార్ మా టివి నుండి అద్దె రూపంలో భారీగానే వసూలు చేస్తున్నాడట. బిగ్ బాస్ షో సెట్ కోసం స్టార్ మా టివి వారు అన్నపూర్ణ స్టూడియోకి రోజుకి అద్దె రూపంలో 5 లక్షలు చెల్లిస్తున్నారట.

షో వంద రోజుల కోసం అన్నపూర్ణ స్టూడియో వారితో ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ షో పూర్తి అయ్యాక ఈ సెట్ ని తొలగిస్తారట. అంతేకాక బిగ్ బాస్ మూడు,నాలుగు సీజన్ లకు కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా, రెండో సీజన్ కి ఎన్టీఆర్ బిజీగా ఉండటంతో నేచురల్ స్టార్ నాని హోస్టింగ్ చేస్తున్నాడు.

మూడు,నాలుగు సీజన్ లకు నానితో కూడా ఒప్పందం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే నాని హోస్టింగ్ విషయంలో మాత్రం కొంతమంది రెండో సీజన్ కి మాత్రమే నానిని హోస్టుగా ఒప్పందం చేసుకున్నారని,మూడు,నాలుగు సీజన్ లకు కాదని అంటున్నారు. మూడో సీజన్ కి హోస్ట్ గా ఎవరైనా చేయవచ్చని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *