ఎన్టీఆర్ ఫై తమన్ ట్వీట్స్..

ఇటీవలే నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదం లో మరణించిన సంగతి తెలిసిందే. ఈయన మరణం తెలుగు దేశం కార్య కర్తలకే కాదు యావత్ తెలుగు ప్రజలకు తీరని లోటు. గతంలో రోడ్డు ప్రమాదం లో అన్నను పోగొట్టుకున్న ఎన్టీఆర్ , తండ్రి ని కూడా అలాగే పోగొట్టుకోవడం మానసికంగా కుంగదీసింది. తండ్రి అంటే ఎంతో ఇష్ట పడే ఎన్టీఆర్ తండ్రి మరణం తర్వాత కొంతకాలం వరకు బయటకు రాకపోవచ్చని అంత అనుకున్నారు. కానీ ఆయన మాత్రం తనను నమ్ముకున్న నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశ్యం తో తండ్రి మరణించిన మూడో రోజే అరవింద సమేత షూటింగ్ లో పాల్గొన్నాడు.

నిన్న ఈ సినిమాలోని ఓ సాంగ్ ను షూట్ చేశారట. ఆ పాటను షూట్ చేస్తున్న క్రమంలో ఎన్టీఆర్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించారని చిత్ర సంగీత దర్శకుడు తమన్ తన ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. ‘తారక్ అన్న చాలా ఎమోషనల్ గా సాంగ్ కోసం షూటింగ్‌ని స్టార్ట్ చేశారు. తన డ్యాన్స్‌ తో, మళ్లీ తన ఎనర్జీని వెనక్కి తెచ్చుకున్నట్టు అనిపించింది. నాకు చాలా మంచి ఫీల్ కలిగింది. నిజంగా మీకు చాలా పవర్ ఉంది అన్న. అరవింద సమేత చిత్రబృందం తరుపున, మీకు లాట్స్ ఆఫ్ లవ్. అదేవిధంగా ఇక నుండి ఆడియో అప్‌డేట్స్ ఈ వారంలో మొదలవుతాయి’ అని థమన్ పోస్ట్ చేసాడు.

ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *